Sudhakar Reddy- Roopa Lakshmi
Sudhakar Reddy- Roopa Lakshmi: తెలుగు సినిమా చరిత్రలోనే ‘బలగం’ ప్రభంజనం సృష్టిస్తోంది. ఊరువాడా అంతా ఏకమై ఈ సినిమాను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ అని కాకుండా ప్రతీ పాత్రను ప్రాధాన్యంగా చూపించారు. ముఖ్యంగా కొమురయ్య పాత్రలో నటించిన ఆయనను రియల్ గా ఎక్కడ చూసినా ఆదరిస్తున్నారు. ఆయన ఏజ్ బార్ అయిన ముసలాయన పాత్రలో నటించి అందరినీ మెప్పించారు. ఓ వైపు కామెడీ చేస్తూ నవ్విస్తూనే.. మరోవైపు కన్నీళ్లు పెట్టి ఏడిపించాడు. ఈ నేపథ్యంలో బలగం కొమురయ్య గురించి అందరూ ఆరా తీస్తున్నారు. ఇక ఈ సినిమాలో కొమురయ్య కూతురుగా లచ్చవ్వ పాత్రలో నటించిన ఆమె పేరు రూప లక్ష్మి. వీరిద్దరు కలిసి ఓ ఛానల్ లో చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి.
బలగం సినిమాలో కొమురయ్య పాత్రలో నటించిన వ్యక్తి పేరు సుధాకర్ రెడ్డి. కరీంనగర్ జిల్లాలోని జూపాక గ్రామం. ఆయనను సినిమాలో చూస్తే రైతులా కనిపించవచ్చు. కానీ ఆయన రియల్ గా హెడ్ మాస్టర్ గా చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే బలగం కంటే ముందు కొన్ని సినిమాల్లో నటించిన ఆయనకు ఈ పాత్ర గురించి ముందే చెప్పలేదట. కానీ ఈ సినిమాలో మీరే హీరో అని చెప్పారట. తనను హీరో అంటే ముందే మురిసిపోయిన సుధాకర్ రెడ్డి పెద్ద పాత్ర ఉండే ఉంటుందని ఊహించారట. దీంతో ఈ సినిమా చేయడానికి సుధాకర్ రెడ్డి ఒప్పేసుకున్నాడట.
అయితే సినిమాలో ఆయన పాత్ర చూసి ఆ తరువాత తనను తాను చూసుకున్న తరువాత ఆయనకే కన్నీళ్లు వచ్చాయని అంటున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత తన భార్యకు ఈ విషయాన్ని చెప్పగా తాను సినిమా చూడకుండానే ఉండిపోయారని చెప్పారు. చిన్నప్పటి నుంచే నాటకాలపై ఆసక్తి ఉన్నా తనకు శిశుమందిర్ లో పిల్లలకు కళలపై యాక్టివిటీస్ నేర్పేవాడినని అన్నారు. 30 ఏళ్ల తరువాత హెడ్ మాస్టర్ గా రిటైర్డ్ అయ్యానని చెబుతున్నారు. ఈ సినిమాలో పాడే మోసే సీన్ ఉంటుందని చెప్పగానే మా సర్పంచ్ ఒప్పుకోలేదని చెప్పడం ఆసక్తిగా మారింది.
Roopa Lakshmi
ఇందుతో కూతురు లచ్చవ్వ పాత్రలో నటించిన రూప లక్ష్మి అంతకుముందే సీరియళ్లలో నటించారు. అయితే ఇందులో నటించడం కొత్త అనుభూతిగా ఉందన్నారు. డైరెక్టర్ వేణు గారికి తాను సలహాలు ఇస్తే ఏమాత్రం వద్దనకుండా స్వీకరించేవారని చెప్పారు. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించినా బలగం ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మరిచిపోలేని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి, స్వరూపలక్ష్మి కలిసి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది. ఆ వీడియోనూ మీరు కూడా చూడండి..