Shivaji : ఒకప్పుడు సినిమాల్లో హీరోగా అద్భుతంగా రాణించిన శివాజీ(Shivaji), మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో రాణించలేకపోయాడు కానీ, సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా మంచిగా డబ్బులను సంపాదించాడు. మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ‘బిగ్ బాస్ 7’ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం ఆయనకు దక్కింది. బిగ్ బాస్ లోకి రావాలి అని ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన కెరీర్ ని ఎవ్వరూ ఊహించని రీతిలో మలుపు తిప్పింది. తన జీవితం బిగ్ బాస్ కి ముందు, ఆ తర్వాత లాగా మారిపోతుందని శివాజీ కూడా ఊహించి ఉండదు. ఆ రేంజ్ లో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే శివాజీ కి దాసోహం అయిపోయారు. శివన్న అని ఆయన్ని ప్రేమగా పిలవడం మొదలు పెట్టారు.
Also Read : బిగ్ బాస్ బాగా కలిసొచ్చిందిగా… అదిరిందయ్యా శివాజీ!
తన కోసం కాకుండా పల్లవి ప్రశాంత్ గెలుపు కోసం ఆడాడు కాబట్టి, శివాజీ బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Telugu 7) టైటిల్ ని గెలవలేకపోయాడు కానీ, లేకపోతే అతి తేలికగా ఆయనే గెలిచేవాడని బయటకు వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఈ షో అయిపోయిన తర్వాత శివాజీ కి సినిమాల్లో అవకాశాలు క్యూలు కట్టాయి. బిగ్ బాస్ కి ముందే ఆయన ’90s’ అనే వెబ్ సిరీస్ చేసాడు. బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఈ సిరీస్ ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అయ్యి సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈటీవీ విన్ యాప్ కి ఇదే మొట్టమొదటి సూపర్ హిట్ అనుకోవచ్చు. ఈ సిరీస్ తర్వాత శివాజీ అనేక సినిమాలకు సంతకం చేసాడు. ఆయన నటించిన చిత్రాల్లో రేపు ‘కోర్ట్'(Court Movie) అనే చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కానుంది.
ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ని నిన్న ఆ చిత్ర నిర్మాత నాని(Natural Star Nani) ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్లకు, మీడియా రిపోర్టర్స్ కు, పాత్రికేయులకు వేసి చూపించాడు. వాళ్ళ నుండి రెస్పాస్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ చిత్రం లో మంగపతి క్యారక్టర్ చేసిన శివాజీ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో ఆయన హీరోయిన్ తండ్రిగా నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో కనిపించాడు. సినిమా మొత్తం పెర్ఫార్మన్స్ కి స్కోప్ దొరికినప్పుడల్లా శివాజీ తన నట విశ్వరూపం చూపించేసాడట. ఈ చిత్రం తర్వాత ఆయనకు టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించే అవకాశం దక్కిందట. రెమ్యూనరేషన్ కూడా అప్పట్లో ఆయన హీరో గా చేస్తున్నప్పుడు ఎంత తీసుకునేవాడు, అంతకు రెండు రెట్లు ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ తర్వాత వచ్చిన ఫేమ్, క్రేజ్ ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకున్న అతి కొద్దిమందిలో శివాజి ఒకడిగా నిలిచాడు.
Also Read : ఏపీ ప్రజలకి ఇదేనా లాస్ట్ మెసేజ్.. చివరి నిమిషంలో సంచలన వీడియో రిలీజ్ చేసిన శివాజీ