Homeఆంధ్రప్రదేశ్‌AP Legislative Council: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం..ఎప్పటి నుండి శాసనమండలి లో...

AP Legislative Council: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం..ఎప్పటి నుండి శాసనమండలి లో అడుగు పెట్టొచ్చంటే!

AP Legislative Council: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎంపికకు సంబంధించిన నామినేషన్స్ ని ఇటీవలే కూటమి పార్టీలకు చెందిన సభ్యులు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ(Janasena Party) నుండి నాగబాబు(Nagendra Babu Konidela), బీజేపీ పార్టీ(Bjp Party) నుండి సోము వీర్రాజు(Somu Veerraju) నామినేషన్స్ వేయగా, టీడీపీ పార్టీ నుండి బీదా రవిచంద్ర, కావాలి గ్రీష్మ, బీటీ నాయుడు వంటి వారు నామినేషన్స్ వేశారు. ఈ 5 మంది కూడా ఏకగ్రీవంగా శాసనమండలి కి ఎంపిక అయ్యినట్టు కాసేపటి క్రితమే రిటర్నింగ్ అధికారి వనిత రాణి ఉత్తర్వులు జారీ చేసారు. ఈ 5 మంది సభ్యులు ఎప్పుడైనా శాసనమండలి లోకి అడుగుపెట్టొచ్చు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలతో పాటు, శాసన మండలి సమావేశాలు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. శాసనసభ లో ప్రతిపక్షం లేకపోవడం తో కాస్త బోరింగ్ గానే సమావేశాలు జరుగుతున్నప్పటికీ, మండలి లో ప్రతిపక్షం ఉండడం తో చర్చలు చాలా హీట్ వాతావరణం లో జరుగుతున్నాయి.

ఇప్పుడు మండలి లోకి అడుగుపెడుతున్న 5 మంది కూడా మంచి వక్తలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాగబాబు ఎలా మాట్లాడుతాడో మన అందరికీ తెలిసిందే. మండలి లో ప్రతిపక్షం చేసే కామెంట్స్ ని ఆయన చాలా సమర్థవతంగా తిప్పి కొట్టగలడు. అదే విధంగా కావలి గ్రీష్మ ఎన్నికల సమయంలో తొడ గొట్టి మాట్లాడిన మాటలను అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఇక సోము వీర్రాజు సంగతి తెలిసిందే. ఈయన కూడా మంచి వక్త. కానీ వైసీపీ పార్టీ కి తొత్తుగా వ్యవహరించే వ్యక్తి అని ఇతనికి ఒక పేరుంది. రఘు రామ కృష్ణంరాజు గారికి నర్సాపురం ఎంపీ సీట్ దక్కకుండా చేయడానికి సోము వీర్రాజు ఎన్నో పన్నాగాలు పన్నాడనే విషయం ఓపెన్ సీక్రెట్ అని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తికీ ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడం ఏమిటి అని అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీ అభిమానులు మండిపడుతున్నారు. మరి శాసనమండలి లో ఈయన అడుగుపెట్టిన తర్వాత ఎవరి వైపు నిలబడి మాట్లాడుతాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular