RRR movie: వచ్చే ఏడాది రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ ఎత్తున ఖర్చు పెట్టి విడుదల చేస్తున్నారు. ఒక విధంగా భారతీయ సినిమా చరిత్రలోనే ఈ స్థాయిలో ఒక సినిమా కోసం ఇంతగా ఎదురు చూడలేదు. అంతగా ఈ చిత్రం కోసం భారతీయ సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఈ భారీ భారీ మల్టీస్టారర్ కి పెద్ద దెబ్బ తగిలింది. పైగా బాలీవుడ్ లో ఈ సినిమాకి దెబ్బ తగలడం పెద్ద విషయం. కోవిడ్ థర్డ్ వేవ్ ఉధృతి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. కాబట్టి, కోవిడ్ థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి సన్నద్ధం అయింది. అందులో భాగంగా.. మహారాష్ట్రలో తాజాగా నైట్ కర్‌ఫ్యూ విధించింది.
Also Read: RRR: సల్మాన్‌ఖాన్‌తో కలిసి తారక్, చెర్రి ‘నాటు నాటు’ స్టెప్పులు
నైట్ కర్‌ఫ్యూ వల్ల రెండు షోలు లాస్ అయినట్టే. అయితే, అంతకు మించిన సమస్య అన్నట్టు.. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన పెట్టింది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసి షాక్ ఇచ్చింది. ఇది నిజంగా బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ కు అతి పెద్ద దెబ్బ. ఆర్‌ఆర్‌ఆర్ జనవరి 7న రిలీజ్ కానుంది. అసలు ఒక పాన్ ఇండియా సినిమాకు బాలీవుడ్ చాలా కీలకం.
అయితే, బాలీవుడ్ కు మహారాష్ట్ర చాలా కీలకం. ఈ లెక్కన, ఆర్ఆర్ఆర్ సినిమాకి అతి పెద్ద దెబ్బ ఇది. భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ గా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి భారీ వసూళ్లను ఆశిస్తున్నారు. మరి మహారాష్ట్రలో 50 శాతం ఆక్యుపెన్సీ విధించడం అంటే, కలెక్షన్స్ లో చాలా తేడా ఉంటుంది. కచ్చితంగా వసూళ్లలో సగం తగ్గిపోతాయి.
కాబట్టి.. ఆర్ఆర్ఆర్ విజయం పై మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బాలీవుడ్ లో ఈవెనింగ్ అండ్ సెకెండ్ షోలకు జనం బారులు తీరుతారు. ఇప్పుడు ఈ నైట్ కర్‌ఫ్యూ కారణంగా ఆ షోలు పడవు. మరి రాజమౌళి ఏమి చేస్తాడో చూడాలి.
Also Read: ఏపీలో థియేటర్లు పూర్తిగా మూతపడిపోనున్నాయా?