Sushmita: ప్రియుడితో బ్రేకప్​పై మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్​ క్లారిటీ

Sushmita: మాజీ విశ్వసుందరి, ప్రముఖ హీరోయిన్ సుస్మితా సేన్​ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ఎప్పుడూ సోషల్​మీడియాలో యాక్టీవ్​గా ఉంటూ.. అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకుంటుంటుంది. ఎన్నో సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. 2018లో సుస్మిత, రోహ్మన్​తో సోషల్ మీడియా వేదికగా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచే అతనితో డేటింగ్​లో ఉన్నట్లు సుస్మిత అధికారికంగా వెల్లడించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ బహిరంగ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 25, 2021 11:57 am
Follow us on

Sushmita: మాజీ విశ్వసుందరి, ప్రముఖ హీరోయిన్ సుస్మితా సేన్​ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ఎప్పుడూ సోషల్​మీడియాలో యాక్టీవ్​గా ఉంటూ.. అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకుంటుంటుంది. ఎన్నో సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

2018లో సుస్మిత, రోహ్మన్​తో సోషల్ మీడియా వేదికగా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచే అతనితో డేటింగ్​లో ఉన్నట్లు సుస్మిత అధికారికంగా వెల్లడించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ బహిరంగ ప్రదేశాలతో పాటు, ఫ్యామిలీ ఫంక్షన్స్​లోనూ తరచూ జంటగా కనిపిస్తుండేవారు.

అయితే, గతకొంత కాలంగా వీరిద్దరి రిలేషన్​షిప్​పై పలు ఊహాగానాలు వినిపిస్తున్నారు. వీద్దరూ విడిపోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు సుస్మిత ఆ విషయాన్ని నిజం చేస్తూ.. ఇన్​స్టాగ్రామ్ వేదికగా రోహ్మన్​తో తన బ్రేకప్​ను ప్రకటించింది. స్నేహితులుగా మొదలైన మా ప్రయాణం.. ఇప్పుడు కూడా అలాగే ఉండాలనుకుంటున్నాం. మా మధ్య బంధం ముగిసినప్పటికీ.. ప్రేమ మాత్రం అలాగే శాస్వితంగా ఉంటుంది. అని పేర్కొన్నారు.  భారత్​లో ఫేమస్ మోడల్​గా పేరు పొందిన రోహ్మన్​.. సుస్మిత కన్న వయసులో 15 ఏళ్లు చిన్నవాడు. కాగా, రోహ్మన్​​ను ఎంతగానో ప్రేమించే సుస్మిత సడన్​గా ఈ నిర్ణయం తీసుకోవడంతో  అభిమానులు  షాక్ అయ్యారు.