spot_img
Homeఎంటర్టైన్మెంట్RRR , Kalki , Pushpa 2 : నైజాంలో ఆర్ ఆర్ ఆర్, కల్కి...

RRR , Kalki , Pushpa 2 : నైజాంలో ఆర్ ఆర్ ఆర్, కల్కి రికార్డ్స్ బ్రేక్ చేసిన పుష్ప 2, ఇదేం క్రేజ్ స్వామి!

RRR , Kalki , Pushpa 2 : పుష్ప 2తో అల్లు అర్జున్ అనేక అరుదైన మైలురాళ్లను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా నైజాం లో ఆర్ ఆర్ ఆర్, కల్కి వంటి భారీ చిత్రాల రికార్డ్స్ ని సైతం పుష్ప 2 బ్రేక్ చేసింది. ఇది అల్లు అర్జున్ కి క్రేజ్ కి నిదర్శనం అంటున్నారు. ఇంతకీ ఆ రికార్డు ఏమిటో చూద్దాం..

విడుదలకు ముందే పుష్ప 2 నిర్మాతలకు లాభాలు పంచింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఈ చిత్రం రూ. 1000 కోట్లు రాబట్టింది. చాలా ఏరియాల్లో పుష్ప 2 రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. పుష్ప 2 హిందీ వెర్షన్ ని రూ. 200 కోట్లకు అమ్మారని సమాచారం. ఇది కల్కి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ. పుష్ప 2 సినిమాకు నార్త్ లో ఉన్న హైప్ రీత్యా రూ. 500 కోట్ల వసూళ్లు ఆ చిత్రం రాబట్టడం ఖాయం అంటున్నారు. పుష్ప పార్ట్ 1 రూ. 100 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.

అలాగే నైజాం లో సైతం పుష్ప 2 ఎవరూ ఊహించని స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాం రైట్స్ ఏకంగా రూ. 100 కోట్లు పలికాయట. ఇది ఆల్ టైం రికార్డు. ఆర్ ఆర్ ఆర్ మూవీ నైజాం రైట్స్ రూ. 75 కోట్లకు అమ్మినట్లు సమాచారం. ఇక ప్రభాస్ నటించిన కల్కి మూవీ నైజాం హక్కులు రూ. 70 కోట్లకు విక్రయించారు. ఆ రెండు చిత్రాలను పుష్ప 2 అధిగమించింది. నైజాం లో పుష్ప 2 రూ. 220 కోట్ల గ్రాస్ రాబడితే కానీ లాభాల్లోకి వెళ్ళదు.

ఇక ఏళ్లుగా కేరళలో అల్లు అర్జున్ కి స్టార్ హీరో ఇమేజ్ ఉంది. ఆయనకు అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ సినిమాల మలయాళ వెర్షన్ అక్కడ విడుదల చేస్తారు. కాబట్టి కేరళ రైట్స్ కూడా పెద్ద మొత్తంలో ఉండే అవకాశం కలదు. చూస్తుంటే పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఆదివారం రాత్రి చెన్నై లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు మంచి రెస్పాన్స్ దక్కింది.

పుష్ప 2 వరల్డ్ వైడ్ డిసెంబర్ 5న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 4 అర్థరాత్రి నుండే షోలు ప్రదర్శించనున్నారట. అడ్వాన్స్ బుకింగ్స్ సైతం ఓపెన్ కానున్నాయి. టికెట్స్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Most Popular

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Oktelugu Epaper
Exit mobile version