https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : యష్మీ ఎలిమినేట్ అవ్వడంతో ఆనందంతో నవ్వుకున్న నిఖిల్..సీత చెప్పినవన్నీ నిజాలేనా?

గత వారం నామినేషన్స్ లోకి పాత కంటెస్టెంట్స్ హౌస్ లోపలకి వచ్చి నామినేషన్స్ చేస్తున్న ప్రక్రియలో సీత నిఖిల్ పై చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి.

Written By: , Updated On : November 25, 2024 / 08:11 AM IST
Bigg Boss Telugu 8: Nikhil laughed with joy after Yashmi was eliminated..Is everything Sita said true?

Bigg Boss Telugu 8: Nikhil laughed with joy after Yashmi was eliminated..Is everything Sita said true?

Follow us on

Bigg Boss Telugu 8 : గత వారం నామినేషన్స్ లోకి పాత కంటెస్టెంట్స్ హౌస్ లోపలకి వచ్చి నామినేషన్స్ చేస్తున్న ప్రక్రియలో సీత నిఖిల్ పై చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి. నిఖిల్ హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ అమ్మాయిలను ట్రాప్ లో పడేసి, వాళ్ళని ఎమోషనల్ గా బాగా డౌన్ చేసి, హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేలా చేస్తాడని చెప్పింది. దీనిపై అందరూ సీతని తప్పుబట్టారు. నిఖిల్ ని అభిమానించని వాళ్ళు కూడా నిఖిల్ కి గత వారం సపోర్టు చేసారు. కానీ నిన్నటి ఎపిసోడ్ లో నిఖిల్ మాస్క్ మొత్తం వీడిపోయినట్టు అనిపించింది. సీత వేసినవి నిందలు కావు, నిజాలే అని చాలా మంది ఆడియన్స్ కి అర్థమైంది. ఎందుకంటే నిన్న యష్మీ ఎలిమినేట్ అయ్యింది. అందరూ ఊహించింది ఏమిటంటే నిఖిల్ బాగా ఎమోషనల్ అవుతాడని, బాధ పడుతాడని అనుకున్నారు,కానీ అవేమి జరగలేదు.

ఒక నాలుగు వారాలు కలిసి ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మనల్ని వదిలి వెళ్ళిపోతేనే చాలా ఫీల్ అవుతాము. అలాంటిది బిగ్ బాస్ హౌస్ లో 83 రోజులు నిఖిల్ యష్మీ తో కలిసి ఉన్నాడు. వీళ్లిద్దరి మధ్య ఎన్నో ఫన్నీ సంఘటనలు జరిగాయి, ఎన్నో ఎమోషనల్ సందర్భాలు కూడా వచ్చాయి. కానీ ఎలిమినేట్ అయితే నిఖిల్ లో ఇంత బాధ కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. యష్మీ బయటకి వెళ్తున్నప్పుడు కన్నెసం ఒక్క చుక్క కనీళ్ళు అయిన కార్చు రా అంటుంది, కానీ నిఖిల్ లో చలనం లేదు. యష్మీ ని నిజంగానే ఆయన మంచి ఫ్రెండ్ అనుకుంటే బాధపడకుండా ఎలా ఉంటాడు?, పైగా ఇతని వల్లనే ఆమె గేమ్ బాగా డౌన్ అయ్యింది అని అనేక సార్లు స్వయంగా ఆమె నోటితోనే చెప్పింది. హౌస్ లోకి మొన్నటి వారంలో నామినేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇదే మాట్లాడారు. నా వల్లనే యష్మీ ఎలిమినేట్ అయిందేమో అనే బాధ కూడా ఇతనిలో లేదా? అనే సందేహాలు ఆడియన్స్ లో తలెత్తాయి.

చూస్తుంటే ఆమెని ఒక అయ్యోమయ్యం స్థితిలోకి నెట్టేసి, ఆమె గేమ్ ని బాగా డౌన్ చేసి ఈరోజు బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకొని ఎలిమినేట్ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చాడు. ఇప్పుడు అనిపిస్తుంది యష్మీ నిఖిల్ తో స్నేహం చేయకుండా, గౌతమ్ లాంటి వాళ్ళతో స్నేహం చేసుంటే ఈరోజు ఆమె టాప్ 5 వరకు వచ్చి ఉండేది అని అంటున్నారు నెటిజెన్స్. నిఖిల్ మాజీ ప్రేయసి కూడా ఇతను ఫేక్ నాటకాలు ఆడుతున్నడని బహిరంగంగా ఇంస్టాగ్రామ్ లో చెప్పుకొచ్చింది. బయటకి వచ్చిన తర్వాత కావ్య ని కలిసి ఆమెతో ప్యాచప్ అవుతానని రెండు వారల క్రితం చెప్పుకొస్తాడు నిఖిల్. అది కేవలం సానుభూతి పొందడం కోసమే అని, నిజమైన ప్రేమ ఆయన చూపలేదని కావ్య ఉద్దేశ్యం. మరి వీటిల్లో ఎంతవరకు నిజం ఉందో నిఖిల్ బయటకి వచ్చిన తర్వాతనే తెలియాలి.