IPL Mega Auction 2025: అయితే ఈసారి ఎలాగైనా ఐపీఎల్ విజేతగా నిలవాలని బెంగళూరు జట్టు భావిస్తోంది. ఇందులో భాగంగా జట్టులో అనవసరమైన ఆటగాళ్లను దూరం పెట్టింది. అవసరం అనుకున్న ఆటగాళ్లకు మాత్రమే అవకాశం కల్పిస్తోంది. అయితే ఈసారి గతాని కంటే భిన్నంగా బెంగళూరు యాజమాన్యం ఆలోచిస్తోంది. ఈ క్రమంలో నలుగురు ఆటగాళ్ల మీద విపరీతమైన ఆశలు పెంచుకుంది. అంతేకాదు వారి కోసం ఏకంగా 44 కోట్లు ఖర్చు చేసింది. బెంగళూరు తీసుకున్న నిర్ణయం మిగతా జట్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. అయితే ఆ నలుగురు నిఖార్సయిన టి20 స్పెషలిస్టులు. “ఈసాల కప్ నమదే గట్టిగా నినాదాలు చేస్తారు.. ఆ తర్వాత దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తారు.. ఎన్నో ఆశలు పెట్టి నట్టేటముంచుతారు. చివరికి బెంగళూరు ఉమెన్స్ జట్టు డబ్ల్యూపీల్ టోర్నీ గెలుచుకుంది. కానీ అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఆటగాళ్లతో కూడిన పురుషుల జట్టు మాత్రం ప్రతిసారి ఎక్కడ ఒకచోట బోల్తా పడుతోంది. అందువల్లే ఈసారి గత తప్పులకు చెక్ పెట్టింది. గట్టి పట్టుదలతో జట్టును కుదుర్చుకుంటున్నది. అందువల్లే ఈసారి వేలంలో ప్రత్యేకమైన బ్యాటర్లను ఎంపిక చేసుకుందని” క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
స్పెషలిస్ట్ ఆటగాళ్లు
ఈసారి వేలంలో టి20 క్రికెట్ స్పెషలిస్ట్ ఆటగాళ్లను బెంగళూరు ఎంపిక చేసుకుంది. వారిలో లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, ఫిల్ సాల్ట్, పేస్ బౌలర్ హేజిల్ వుడ్ ఉన్నారు.. ఇంగ్లాండ్ జట్టుకు చెందిన లివింగ్ స్టోన్ ను 8.75 కోట్లకు బెంగళూరు కొనుగోలు చేసింది. సాల్ట్ ను 11.5 0 కోట్లకు దక్కించుకుంది. టీమిండియా ఆటగాడు జితేష్ శర్మ ను 11 కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్ వుడ్ ను 12.5 కోట్లకు కొనుగోలు చేసింది. బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, లివింగ్ స్టోన్, జితేష్ శర్మ వంటి వారు ఉన్నారు. మీరు అద్భుతమైన ఆటగాళ్లు కావడంతో.. బెంగళూరు జట్టుకు తిరుగు ఉండదని అభిమానులు భావిస్తున్నారు. ” సాల్ట్ కోల్ కతా జట్టు బ్యాటింగ్ దళానికి వెన్నెముకలాగా నిలిచాడు.. గత సీజన్లలో అతని ఆట చూస్తే ఇలానే అనిపిస్తుంది.. తన మార్కు బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు. పంజాబ్ జట్టుకు మిడిల్ ఆర్డర్ ఆటగాడిగా లివింగ్ స్టోన్ తన బాధ్యతను నిర్వర్తించాడు. వీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే విధంగా బ్యాటింగ్ చేశారు. అందువల్లే ఆ జట్లు విజయాలను దక్కించుకున్నాయి. ఈసారి కూడా బెంగళూరు జట్టుకు వారు అదే స్థాయిలో ఆడతారని భావిస్తున్నాం. కచ్చితంగా బెంగళూరు ఈసారి అద్భుతంగా ఆడుతుందని.. ఆ అంచనా మాకు ఉంది. ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించాలి. అప్పుడే కప్ కల నెరవేరుతుంది. సుదీర్ఘకాలంగా వెంటాడుతున్న ఛాంపియన్ హోదా దక్కుతుందని” బెంగళూరు అభిమానులు సామాజిక మాధ్యమాలలో తమ అభిప్రాయాలను పేర్కొంటున్నారు.