https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ ఎఫెక్ట్.. రాంచరణ్ ముందస్తు ప్లాన్..!

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తాజాగా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’. దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా నటిస్తుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా కన్పించనున్నాడు. ఈ మూవీపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ రాంచరణ్ హీరోగా నటిస్తూనే నిర్మాతగా సినిమాలను నిర్మిస్తున్నాడు. కరోనా ప్రభావం రాంచరణ్ నిర్మిస్తున్న ‘ఆచార్య’పై పడింది. రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తూనే ‘ఆచార్య’ను లైన్లో పెట్టడంతో ఈ రెండు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2020 / 01:52 PM IST
    Follow us on


    మెగాపవర్ స్టార్ రాంచరణ్ తాజాగా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’. దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా నటిస్తుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా కన్పించనున్నాడు. ఈ మూవీపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    రాంచరణ్ హీరోగా నటిస్తూనే నిర్మాతగా సినిమాలను నిర్మిస్తున్నాడు. కరోనా ప్రభావం రాంచరణ్ నిర్మిస్తున్న ‘ఆచార్య’పై పడింది. రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తూనే ‘ఆచార్య’ను లైన్లో పెట్టడంతో ఈ రెండు సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడంలో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో ఇరు సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించేందుకు రాంచరణ్ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

    Also Read: చిరంజీవి, మోహన్ బాబుల గాలి తీసిన బాలయ్య.. హాట్ కామెంట్స్

    ఈనేపథ్యంలోనే రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’లో చిన్న గ్యాప్ తీసుకొని ‘ఆచార్య’లో నటించనున్నాడని సమాచారం. అయితే ‘ఆర్ఆర్ఆర్’ ఎఫెక్ట్ రాంచరణ్ తదుపరి సినిమాలపై పడే అవకాశం కన్పిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో నిర్మితవుతోంది. ఈ సినిమా తర్వాత రాంచరణ్ ఇమేజ్ వరల్డ్ వైడ్ కావడం ఖాయంగా కన్పిస్తోంది.

    ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాంచరణ్ ఓ తెలుగు మూవీలో నటించాలని భావించాడు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అతడి ఇమేజ్ మారిపోనుండటంతో అందుకు తగ్గట్టుగానే సినిమాలు చేసేందుకు రాంచరణ్ సన్నహాలు చేసుకుంటున్నాడు. గతంలో తాను నటించిన ధృవ సినిమా సీక్వెల్ కు రాంచరణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ విన్పిస్తోంది.

    Also Read: ‘వకీల్ సాబ్’ పవన్ మెట్రో ప్రయాణం.. చూసి తీరాల్సిందే..!

    ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాంచరణ్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేయాలని భావిస్తున్నాడు. దీంతో ధృవ సీక్వెల్ ను కూడా పాన్ ఇండియా లెవల్లో నిర్మించాలని దర్మకుడికి సూచిస్తున్నాడట. ‘ఆర్ఆర్ఆర్’.. ‘ఆచార్య’ పూర్తయ్యాకే ధృవ-2 సీక్వెల్ ఉండనుండటంపై ఆమేరకు రాంచరణ్ ముందస్తు ప్లాన్ చేసుకుంటున్నాడు.