https://oktelugu.com/

రాబిట్‌హాస్‌ మేయర్‌గా శునకం..!

అమెరికా ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రతి ఒక్కరు ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికవుతారా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఓ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అమెరికాలోని కెంటకీలోని రాబిట్‌ హాస్‌ అనే ఒక చిన్న పట్టణం ఫ్రెంచ్‌ బుల్‌డాగ్‌ను తమ కొత్త నాయకుడిగా ఎన్నుకుంది. రాబిట్‌ హాష్‌లో ఎన్నికల్లో మేయర్‌ ఎన్నికలు నిర్వహించగా 13,143 ఓట్ల తేడాతో విల్బర్‌ బీస్ట్‌ అనే శునకం గెలుపొందింది. జాక్‌ రాబిట్‌ బీగల్‌, గోల్డెన్‌ […]

Written By: , Updated On : November 5, 2020 / 01:24 PM IST
Follow us on

అమెరికా ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రతి ఒక్కరు ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికవుతారా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఓ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అమెరికాలోని కెంటకీలోని రాబిట్‌ హాస్‌ అనే ఒక చిన్న పట్టణం ఫ్రెంచ్‌ బుల్‌డాగ్‌ను తమ కొత్త నాయకుడిగా ఎన్నుకుంది. రాబిట్‌ హాష్‌లో ఎన్నికల్లో మేయర్‌ ఎన్నికలు నిర్వహించగా 13,143 ఓట్ల తేడాతో విల్బర్‌ బీస్ట్‌ అనే శునకం గెలుపొందింది. జాక్‌ రాబిట్‌ బీగల్‌, గోల్డెన్‌ రిట్రీవర్‌ అనే రెండు శునకాలు రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. మొత్తం 22, 985 ఓట్లు పోలయ్యాయి.

ఎందుకు మేయర్‌గా శునకం..?

కెంటకీ డాట్‌కామ్‌ ప్రకారం ఒహియో నది వెంబడి ఉన్న ఒక ఇన్‌కార్పొరేటెడ్‌ కమ్యూనిటీ అయినా రాబిట్‌ హాష్‌, 1990 నుంచి ఒక శునకాన్ని మేయర్‌గా ఎన్నుకుంటూ వస్తోంది. మేయర్‌గా ఎన్నికైన శునకం పదవీ బాధ్యతల స్వీకరించిన తరువాత స్వచ్ఛంద సంస్థల కోసం డబ్బును సేకరించడంలో సహాయపడుతుంది. తాజాగా ఎన్నికైన విల్బర్‌ అనే శునకం ప్రతినిధి అమీ నోలాండ్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ తనకు మద్దతు తెలుపుతూ గెలిపించిన వారికి అందరికీ విల్బర్‌ కృతజ్ఞతలు చెప్పారని నోలాండ్‌ తెలిపారు.