టాలీవుడ్ తో పాటు మిగిలిన ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు, స్టార్ డైరక్టర్లు కూడా తమ రెమ్యూనిరేషన్లను తగ్గించుకుంటే బాగుంటుందని ప్రొడ్యూసర్స్ బలంగా కోరుకుంటున్నారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం అందుకు అంగీకరించే పరిస్థితి లేదు. అయితే హిందీ పరిశ్రమకు చెందిన కొంతమంది హీరోలు మాత్రం.. ఈ కరోనా నుండి పూర్తిగా పరిశ్రమ కోలుకున్నే దాకా తమ రెమ్యూనిరేషన్ లో 30శాతాన్ని, స్టార్ డైరక్టర్లు తమ రెమ్యూనిరేషన్ లో 25శాతాన్ని తగ్గించుకున్నారు. కానీ తెలుగు స్టార్ హీరోలు మాత్రం రెమ్యూనిరేషన్ తగ్గించుకునే ఆలోచనలో లేరు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
నిర్మాతలు నష్టాల పాలు అయినా.. అది తమకు సంబంధం లేదనే విధంగా హీరోల ఆలోచనలు ఉన్నాయట. తమకు మార్కెట్ ఉంటేనే కదా.. తమతో సినిమాలు చేస్తోంది. అలాంటప్పుడు లాభాలు వచ్చినప్పుడు నిర్మాతలు తమకు డబ్బులు పంచలేదు కదా.. ఇప్పుడు నష్టాలు రాకుండానే రెమ్యూనిరేషన్ తగ్గించుకోమంటే ఎలా..? అనేది హీరోల పాయింట్. కాకపోతే ఈ కరోనా నేపథ్యంలో సినిమాలు షూట్ చేయడం అనేది అధిక వ్యయంతో కూడుకున్న పని.. సినిమా నిర్మాణం రెగ్యులర్ డేస్ కంటే.. ప్రస్తుతం అధికమైంది. కాబట్టి.. సినీ నిర్మాణం నష్టపోవడానికే అన్నట్టు తయారైన ఈ పరిస్థితుల్లో.. హీరోలు ఇగోకు పోకుండా నిర్మాతల గురించి ఆలోచిస్తే మంచింది.
Also Read: ‘వకీల్ సాబ్’ పవన్ మెట్రో ప్రయాణం.. చూసి తీరాల్సిందే..!
నష్టాల నుండి నిర్మాతలు కోలుకోవాలంటే ఏమి చేయాలి అని ఆ మధ్య టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సీక్రెట్ గా చర్చలు జరిపినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. నిజానికి ఈ చర్చలలో కోన్ని తీర్మానాలు చేసినా.. కొన్ని నిర్ణయాలు తీసుకున్నా.. స్టార్స్ ఎవ్వరూ పట్టించుకోలేదు. రెమ్యూనిరేషన్ తగ్గించుకునే విధంగా స్టార్స్ అందరూ ఒప్పుకునేలా చేయాలని ప్రొడ్యూసర్స్ ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ రెమ్యూనిరేషన్ ల తగ్గింపు అనేది సాధ్యమేనా? స్టార్ హీరోల మీద ఆధారపడి సినిమాలు చేస్తున్న నిర్మాతలు పరిస్థితి చివరకు ఏమవుతుందో చూడాలి.