RRR Releasing In 3D: ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు నాలుగేళ్లుగా ఎదురుచూస్తోన్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు ఈనెల 25న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులకు రాజమౌళి ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. మార్చి 25 నుంచి 3డీలో ప్రదర్శించేందుకు అనుకూలంగా ఉన్న థియేటర్లలో ‘ఆర్ఆర్ఆర్’ను 3డీలో అనుభూతి చెందవచ్చని రాజమౌళి తెలిపారు.
హైదరాబాద్లో నిర్వహించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రచార కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్’ విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సీఎం జగన్కు అందజేసిన వినతి పత్రంలో ఎలాంటి రహస్యాలు లేవన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారమే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి టికెట్ ధరలు ఉంటాయని సీఎం తెలిపారన్నారు.ప్రేక్షకులు ఆశిస్తున్నట్లు బెన్ఫిట్ షోలు తప్పకుండా ఉంటాయని రాజమౌళి స్పష్టం చేశారు.
Also Read: Sridevi BoneyKapoor: రాఖీ కట్టిన వ్యక్తినే పెళ్లి చేసుకున్న శ్రీదేవి.. స్టార్ హీరో మోసం వల్లేనా?
అలాగే తెలుగు చలన చిత్ర తలమానికం RRR విడుదలకు అంతా సిద్ధమైంది. బాహుబలి కంటే మిన్నగా అంచనాలను సాధించిన ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను దుబాయ్‌తో పాటు కర్ణాటకలోనూ చేయబోతున్నట్టు సమాచారం. 19న బెంగళూరులోని చిక్కబల్లాపూర్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ ఉంటుందని భావిస్తుండగా, పునీత్ రాజ్‌కుమార్‌కి అంకితమిస్తూ ముఖ్య అతిథిగా కర్ణాటక సీఎం బసవరాజుతో పాటు కన్నడ సినీ ప్రముఖులు పాల్గొంటారని తెలుస్తోంది.
కాగా ఆర్ఆర్ఆర్ మూవీపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొని ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు.