CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఎక్కడికక్కడ అప్పులు పెరిగిపోతున్నాయి. గత ప్రభుత్వంలో తీసుకున్న పీపీఏలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం వివాదాలకు తావిస్తోంది. బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో తొమ్మిది శాతం వడ్డీ చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వానికి గుదిబండగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం మెడకు చుట్టుకోవడంతో బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఇప్పటికే కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది పరిస్థితి. పీపీఏల్లో రూ. కోట్లలో అవినీతి చోటుచేసుకుందని ప్రభుత్వం వాటిని చెల్లించేది లేదని తెగేసి చెప్పింది. దీంతో సంప్రదాయేతర విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో తమకు సంబంధం లేదని చెబుతోంది. దీనికి సంబంధించిన అవినీతి విషయంలో కూడా ఆధారాలు ఇవ్వాలని కేంద్రం అడగడంతో రాష్ట్రం సరైన సమాధానం చెప్పలేకపోతోంది.
Also Read: KTR: బస్తీమే సవాల్.. కిషన్ రెడ్డిని సన్మానిస్తానంటున్న కేటీఆర్ .. కారణమిదే..
రాష్ట్రం చెప్పినట్లు వినడం లేదని కేంద్రం అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు చట్టం చేయడంతో ఇక రాష్ట్రాలు కచ్చితంగా చెల్లించి తీరాల్సిన అవసరం ఏర్పడుతోంది. కేంద్రం నుంచి లేఖలు వస్తున్నా జగన్ మాత్రం చలించడం లేదు. దీంతో ఒప్పందాల విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తూ తప్పించుకోవాలని చూస్తున్నా తప్పకపోవచ్చని తెలుస్తోంది. దాదాపు రూ. 6 వేల కోట్లు చెల్లించాల్సిందేనని చెబుతుండటంతో జగన్ ఏ మేరకు స్పందిస్తారో తెలియడం లేదు.
ప్రస్తుతం బకాయిలు చెల్లించడం ఖాయంగా కనిపిస్తోంది. కోర్టుకు వెళ్లినా తప్పేలా లేదు. దీంతో ప్రభుత్వం మీద భారం పడనుంది. కానీ తాను చేసుకున్న తప్పిదమే తనకు ముప్పుగా పరిణమిస్తోందని తెలుస్తోంది. ఇన్నాళ్లు చెల్లించకుండా మొండికేయడంతోనే బకాయిలు పె రిగినట్లు చెబుతున్నారు. ఇక ఇప్పుడు మాత్రం చెల్లించక తప్పని స్థితిలో ప్రభుత్వం ఏం చేయనుందనే దానిపై అందరికి సందేహాలు వస్తున్నాయి. టీడీపీ హయాంలో చేసుకున్న ఒప్పందాలకు తామెలా బాధ్యులమవుతామంటూ ప్రశ్నించడంతోనే సమస్య మొదలైంది. ఏ ప్రభుత్వం వచ్చినా బకాయిలు మాత్రం చెల్లించాల్సిందేనని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే సమస్య మొదటికొచ్చిందని తెలుస్తోంది.
Also Read: Congress Party: ఐదు రాష్ట్రాల ఓటమి.. మొదటి పీసీసీ చీఫ్ సిద్ధూ ఔట్.. కాంగ్రెస్ ప్రక్షాళనే