Telangana NHM Vacenciess 2022: నేషనల్ హెల్త్ మిషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 92 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. స్టాఫ్ నర్స్ పోస్టులకు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కాంట్రాక్ట్ ప్రాతిపదిన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 32 ఉండగా 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 28,500 రూపాయలు వేతనంగా లభించనుంది. ఎంఎల్‌టీ/డీఎంఎల్‌టీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
Also Read: RRR Movie Ram Charan NTR: వైరల్ అవుతున్న ‘ఎన్టీఆర్ – చరణ్’ ఫన్నీ ఇంటర్వ్యూ
అనుభవం ఉన్నా లేకపోయినా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫార్మసిస్ట్ పోస్టులు 26 ఉండగా 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బీఫార్మసీ, ఎంఫార్మసీ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. recruitments.nhm@gmail.com ఈమెయిల్ కు ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.
2022 సంవత్సరం మార్చి 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://tsnhm.cgg.gov.in/nhmfwweb20/ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: Tollywood Trends : టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్