Roshan
Roshan : నిర్మల కాన్వెంట్ అనే చిత్రం తో సీనియర్ హీరో శ్రీకాంత్(Hero Srikanth) కొడుకు రోషన్(Roshan Meka) ఇండస్ట్రీ లోకి వెండితెర అరంగేట్రం చేసాడు. ఈ సినిమాలో చిన్న పిల్లవాడిగా ఉన్నాడు కాబట్టి, ఇది చైల్డ్ ఆర్టిస్ట్ కోటాలో చేరింది. కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించని ఈ చిత్రం, టీవీ టెలికాస్ట్ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ చిత్రం తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి 2021 వ సంవత్సరం లో ‘పెళ్లి సందడి'(Pelli Sandadi Movie) అనే చిత్రం ద్వారా హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, రోషన్ కి మంచి క్రేజ్ కూడా వచ్చింది. కుర్రాడి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది, యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ కూడా అదరగొట్టేసాడు, మంచి గా కెరీర్ ని ప్లాన్ చేసుకుంటే పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు అని అందరూ అనుకున్నారు.
Also Read : హీరోగా యాంకర్ సుమ కొడుకు… ఫస్ట్ లుక్ చూశారా!
ఈ చిత్రం లో రోషన్ తో పాటు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శ్రీలీల(Heroine Srileela) యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని అరడజను సినిమాలు చేసింది. కానీ రోషన్ మాత్రం బాగా గ్యాప్ తీసుకున్నాడు. అసలు ఏమయ్యాడు ఈ కుర్రాడు, ఇంత మంచి టాలెంట్ ని పెట్టుకొని ఎందుకు ఖాళీగా ఉన్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఇతను కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాలి అనే ప్లానింగ్ తో వస్తున్నట్టు ఎవ్వరు గమనించలేకపోయారు. ప్రస్తుతం ఆయన కల్కి చిత్రాన్ని నిర్మించి, పీక్ రేంజ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న వైజయంతి మూవీస్ తో ‘ఛాంపియన్'(Champion Movie) అనే సినిమా చేస్తున్నాడు. నేడు రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో ని కాసేపటి క్రితమే విడుదల చేసారు మేకర్స్. ఈ గ్లిమ్స్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యంగా రోషన్ లుక్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. చివరి షాట్ లో ఆయన లుక్స్ ని చూసి హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఉన్నాడని ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. ఫైట్స్ లో వేగం, డ్యాన్స్ లో గ్రేస్ రోషన్ కి ఆభరణాలు వంటివి. వాటిని సరిగ్గా ఉపయోగించుకొని ముందుకుపోతే రోషన్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల లీగ్ లోకి చేరిపోతాడని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ఈ ఛాంపియన్ చిత్రం ద్వారా ప్రదీప్ అద్వైతం మన ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి, కచ్చితంగా కల్కి డైరెక్టర్ నాగ అశ్విన్ హ్యాండ్ కూడా ఈ సినిమాపై ఉంటుందని, కాబట్టి ఔట్పుట్ గురించి ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదని, ఈ సినిమాతోనే రోషన్ కుంభస్థలం బద్దలు అయ్యే రేంజ్ లో బ్లాక్ బస్టర్ ని అందుకుంటాడని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఆ రేంజ్ కి ఈ సినిమా చేరుకుంటుంది లేదా అనేది.