Roja Daughter: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి ని సంపాదించుకున్న నటి రోజా… ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలను చేసి టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక తమిళ దర్శకుడు అయిన సెల్వమణిని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోయింది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది… 2019 లో వైసీపీ పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆమె నగరి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మంత్రి అయ్యారు… ప్రస్తుతం ఆ పార్టీలో క్రియాశీలకమైన నెంబర్ గా కొనసాగుతున్న ఆమె మాజీ ఎమ్మెల్యేగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు… ఆమె కూతురు అయిన అన్షు పెళ్లికి సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజానికి రోజా గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్షు కి సినిమా ఇండస్ట్రీకి రావాలనే కోరిక లేదని ఆమె సైంటిస్ట్ అవ్వాలనుకుంటుందని అమెరికాలో ఉన్నత చదువుల కోసం పంపించామని చెప్పింది… మన ఇష్టాలను పిల్లల మీద రుద్దద్దని సినిమా ఇండస్ట్రీకి వస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. కానీ తనకు ఇష్టం లేకపోవడంతో ఆమె ఒక డ్రీమ్ తో ముందుకు సాగుతోంది. కాబట్టి ఆమె డ్రీమ్ ని ఎంకరేజ్ చేశానని చెబుతున్నారు.
ఇక రీసెంట్ గా అన్షుకి ఒక స్టార్ హీరో తో పెళ్లి ఫిక్సయింది అంటూ వస్తున్న మాటలు మీద కూడా రోజా స్పందించారు. ఆ హీరో ఎవరో చెబితే బాగుంటుంది అంటూ ఆమె నవ్వుతూ సమాధానమైతే చెప్పారు. మొత్తానికైతే రోజా ప్రస్తుతం పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నప్పటికి తన పిల్లల కేరింగ్ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. వాళ్ల పిల్లలు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ రంగంలో వాళ్ళు ముందుకు వెళ్లడానికి ఉన్నతమైన చదువులను చదివిస్తూ శిక్షణను ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారు.
మరి వాళ్ళ పిల్లలు సైతం ఆ రకంగా ముందుకు సాగుతూ ఉండడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక పాలిటిక్స్ లో చాలామందిని విమర్శిస్తూ ఫైర్ బ్రాండ్ గా తనకంటూ ఒక ఐడెంటిటి సంపాదించుకున్న రోజా 2024 ఎన్నికల్లో ఓడిపోయిన కూడా తన నియోజకవర్గంలో కొంతమంది పేదలకు సహాయం చేస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు…