Roja Daughter Ramp Walk: హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సొంతం చేసుకొని ,అగ్ర కథానాయికగా ఎదిగి, ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేసి, ఎమ్మెల్యే గా, మంత్రిగా చేసి, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ నేతగా కొనసాగుతున్న రోజా(Roja Selvamani) గురించి తెలియని వాళ్లంటూ ఉంటారా చెప్పండి. సినిమాలకు ఆమె దూరమై చాలా కాలమే అయ్యింది కానీ, రాజకీయాల్లో మాత్రం ఇప్పటికీ యాక్టీవ్ గానే కొనసాగుతుంది. ఆమె మాట్లాడే ప్రతీ మాట ఎంత వివాదాలకు దారి తీస్తుంటాయో మనమందరం చూస్తూనే ఉన్నాం. ఒక్కోసారి మహిళ అయ్యుండి ఇలాంటి మాటలు ఈమె ఎలా మాట్లాడుతుంది అనిపిస్తాది, ఒక్కోసారి ఐరన్ లేడీ, ఏమి మాట్లాడిందిరా శభాష్ అనిపిస్తాది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె గురించి చాలానే ఉన్నాయి. అయితే ఈమెకు అన్షు రెడ్డి అనే కూతురు ఉంది. ఈమె చిన్నతనం నుండే మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి అని చెప్తూ ఉంటుంది రోజా.
Also Read: కోటాను చూసి వెక్కి వెక్కి ఏడ్చిన బ్రహ్మానందం… వీడియో వైరల్
చిన్నతనం లోనే ఆమె రచయితగా మారి కొన్ని పుస్తకాలను రచించింది కూడా. పోటీలలో ఆమెకు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. చూసేందుకు రోజా కి జిరాక్స్ కాపీ లాగా అనిపించే అన్షు రెడ్డి, భవిష్యత్తులో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో తెలియదు కానీ, ఈమె మాత్రం హీరోయిన్ మెటీరియల్ అనడం లో ఎలాంటి సందేహం లేదు. లేటెస్ట్ గా ఆమె ఒక ఈవెంట్ లో ర్యాంప్ వాక్ చేసింది. హీరోయిన్స్ ఎలాంటి దుస్తుల్లో అయితే కనిపిస్తారో, అలాంటి దుస్తుల్లో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. ఆమె ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడంతో,ఇంత అందంగా ఉందేంటి బాబోయ్, రోజా కూడా ఈమె అందం ముందు సరితూగదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఈమధ్య కాలం లో ఎంతో మంది కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, ఒకటి రెండు హిట్ సినిమాలు తగలగానే స్టార్ ఇమేజ్ ని అందుకుంటున్నారు.
వాళ్ళతో పోలిస్తే అన్షు రెడ్డి ఎంతో అందంగా అనిపిస్తుంది. నటన, డ్యాన్స్ ఎలా ఉంటుందో తెలియదు కానీ, ఆ రెండు కూడా ఉంటే మాత్రం అన్షు రెడ్డి కి ఇండస్ట్రీ లో తిరుగు ఉండదు. మరి సినిమాల్లోకి ఈమె ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే రోజా సినిమాలకు దూరమైనా, బుల్లితెర ద్వారా మన తెలుగు ఆడియన్స్ ని ఎదో ఒక షో తో అలరిస్తూ ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే. ఒకప్పుడు జబర్దస్త్ న్యాయనిర్ణేతగా రోజా కి మంచి క్రేజ్ ఉండేది. మంత్రి అయ్యాక ఆ షోకి దూరమైంది. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. జీ తెలుగు లో వరుసగా రెండు షోస్ కి ఆమె ప్రస్తుతం న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ముందుకు దూసుకుపోతుంది.