https://oktelugu.com/

Vennela Kishore : ప్రొమోషన్స్ కోసం వెన్నెల కిషోర్ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Vennela Kishore : కమెడియన్స్ సందడి మన టాలీవుడ్ లో మెళ్లిగా తగ్గిపోతున్న సమయంలో వెన్నెల కిషోర్(Vennela Kishore) ఎంట్రీ కారణంగా మళ్ళీ టాలీవుడ్ లో కమెడియన్స్ కి కొత్త ఊపిరి వచ్చింది.

Written By: , Updated On : March 27, 2025 / 04:07 PM IST
Vennela Kishore

Vennela Kishore

Follow us on

Vennela Kishore : కమెడియన్స్ సందడి మన టాలీవుడ్ లో మెళ్లిగా తగ్గిపోతున్న సమయంలో వెన్నెల కిషోర్(Vennela Kishore) ఎంట్రీ కారణంగా మళ్ళీ టాలీవుడ్ లో కమెడియన్స్ కి కొత్త ఊపిరి వచ్చింది. వెన్నెల కిషోర్ లోని అద్భుతమైన కామెడీ టైమింగ్, వింటేజ్ సునీల్ ని గుర్తు చేసింది. అందుకే మేకర్స్ కేవలం వెన్నెల కిషోర్ కోసం సన్నివేశాలు రాయడం మొదలు పెట్టారు. అలా అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో వెన్నెల కిషోర్ స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్స్ సూపర్ హిట్స్ అవ్వడంతో, డైరెక్టర్స్ కామెడీ ట్రాక్స్ ని ఆడియన్స్ ఇప్పటికీ ఆదరిస్తున్నారనే విషయాన్నీ గ్రహించి, ఇతర కమెడియన్స్ పై మళ్ళీ కామెడీ ట్రాక్స్ రాయడం మొదలు పెట్టారు. అలా టాలీవుడ్ లో మళ్ళీ సినిమాల్లోకి ప్రత్యేకమైన కామెడీ ట్రాక్స్ సంస్కృతి పునః ప్రారంభం అయ్యింది.

Also Read : బ్రహ్మానందంలోని ఆ గొప్పతనాన్ని బయటపెట్టిన వెన్నెల కిషోర్.. వైరల్ వీడియో

సినిమాల్లో వెన్నెల కిషోర్ ఎంత సరదాగా కనిపిస్తాడో, బయట కూడా అంతే సరదాగా కనిపిస్తాడు. కానీ ఎందుకో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్స్, మూవీ ప్రొమోషన్స్ కి సంబంధించిన ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు ఎక్కువ ఇష్టపడడు. దీనిపై హీరో నితిన్(Nithin) ఇటీవలే తన ‘రాబిన్ హుడ్'(Robinhood Movie) మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఒక ఫన్నీ పోడ్ కాస్ట్ చేశాడు. ఇందులో ఆయన వెన్నెల కిషోర్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరెందుకు ఎక్కువగా మూవీ ప్రొమోషన్స్ లో పాల్గొనడానికి ఇష్టపడరు?’ అని అడగగా, దానికి వెన్నెల కిషోర్ సమాధానం ఇస్తూ ‘మీరు హీరో..ఆరు నెలల వరకు ఒకే సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. నేను కమెడియన్, ఆరు నెలల్లో ఆరు సినిమాలకు పైగా చేస్తుంటాను, నేను ఎంత బిజీ గా ఉన్నానో చూసారా?, అందుకే ప్రొమోషన్స్ కి పాల్గొనడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు నితిన్ అడిగిన మరో ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

‘నీ గురించి నాకు చాలా మంది చెప్పారబ్బా..నీకు డబ్బులు ఇస్తేనే ప్రమోషన్ చేస్తావంట కదా?’ అని అడిగితే, ‘అనుకునే వాళ్ళు వంద అనుకుంటారు, నేను పట్టించుకోను అని సమాధానం ఇస్తాడు’, అప్పుడు నితిన్ ‘మరి రాబిన్ హుడ్ ప్రొమోషన్స్ లో ఎందుకు పాల్గొంటున్నారు?’ అని అడగగా, దానికి వెన్నెల కిషోర్ సమాధానం ఇస్తూ ‘నిర్మాతలు చెక్ ఇచ్చారు, అందుకే చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి వెన్నెల కిషోర్ ప్రొమోషన్స్ కి ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తేనే వస్తాడు అన్నమాట అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే వెన్నెల కిషోర్ రాబిన్ హుడ్ చిత్రం లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆయన పాత్ర ఆడియన్స్ కి పొట్ట చెక్కలు అయ్యేలా చేస్తుందట. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా వెన్నెల కిషోర్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోతుంది అని అంటున్నారు మూవీ టీం.

Also Read : వెన్నెల కిషోర్ ఇంట్లో కుప్పలుగా 2000 నోట్లు… రద్దయ్యాయి ఏం చేసుకుంటాడని ఆ హీరో ట్వీట్!