Allu Arjun , Atlee
Allu Arjun and Atlee : ఇప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను సాధించాలని చూస్తున్నారు. ప్రతి హీరో కూడా సక్సెస్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. ఇక అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో వరుసగా పుష్ప, పుష్ప 2 సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించాడు. బాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నాడు…
‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు అల్లు అర్జున్(Allu Arjun)… ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన అట్లీ (Atlee)తో చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమా 600 కోతల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. అట్లీ కమర్షియల్ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. అందువల్ల ఆయనతో సినిమా చేస్తే తనకి కూడా భారీ గుర్తింపు వస్తుందనే ఉద్దేశ్యం తోనే అల్లు అర్జున్ తనతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు.
Also Read : అల్లు అర్జున్, అట్లీ సినిమాలో 5 మంది హీరోయిన్లు, ఇద్దరు హీరోలు..అసలు ఇదేమి ప్లానింగ్ బాబోయ్!
ఇక ప్రస్తుతం ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పునర్జన్మ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతుంది. తద్వారా ఈ సినిమాతో అల్లు అర్జున్ తనకంటూ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. పుష్ప 2 సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంత పెద్ద విజయాన్ని సాధించిన సినిమా మరొకటి లేకపోవడం ఇక బాహుబలి సినిమా రికార్డుని అల్లు అర్జున్ బ్రేక్ చేయడం లాంటి విషయాలను చూస్తే అల్లు అర్జున్ క్రేజ్ తారా స్థాయికి పెరిగిపోయిందనే చెప్పాలి. తద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనను మించిన నటుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోశక్తి లేదు.
అందుకే ఇప్పుడు చేస్తున్న సినిమాలు తన స్టార్ డమ్ ను పెంచే విధంగా ఉండాలి గాని తగ్గించే విధంగా ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయన ఆ సినిమాను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. అట్లీ ఇంతకుముందు షారుక్ ఖాన్ తో చేసిన జవాన్ (Jawan) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పే ప్రయత్నమైతే చేశాడు. అల్లు అర్జున్ చేస్తున్న సినిమాతో పునర్జన్మల కాన్సెప్ట్ చాలా సెన్సిటివ్ గా డీల్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…
Also Read : అల్లు అర్జున్-అట్లీ మూవీలో మరో హీరో.. ఆ స్టార్ కోసం రాసిన కథనా?