https://oktelugu.com/

Rhea Chakraborty: కొత్త ప్రియుడితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి..అతను ఎవరో మీరే చూడండి!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మన తెలుగు ఆడియన్స్ కి మహేంద్ర సింగ్ ధోని బియోపిక్ ద్వారా సుపరిచితమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయనకీ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్స్ వచ్చాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇంత దూరం వచ్చిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని ఇప్పటికీ అభిమానిస్తూనే ఉంటారు ఆయన అభిమానులు.

Written By:
  • Gopi
  • , Updated On : August 18, 2024 / 05:19 PM IST

    Rhea Chakraborty

    Follow us on

    Rhea Chakraborty: కొంతమంది అమ్మాయిల వల్ల అబ్బాయిల జీవితాలు నాశనం అవుతున్నాయి అనడానికి ఇటీవల కాలంలో ఎన్నో ఉదాహరణలు మనం చూసాము. అలాంటి ఉదాహరణలో ఒకటి ప్రముఖ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన. బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న సుశాంత్ సింగ్ ఈరోజు బ్రతికి ఉండుంటే పెద్ద సూపర్ స్టార్ అయ్యేవాడు. కానీ అతని జీవితంలోకి ఎప్పుడైతే రియా చక్రవర్తి వచ్చిందో అప్పటి నుండి మొత్తం మారిపోయింది. ఆమె కారణంగా ఈయన మాలాకద్రవ్యాలకు అలవాటుపడి, ఎలాంటి మానసిక ఒత్తిడికి గురయ్యాడో ఏమో తెలియదు కానీ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే ఆత్మహత్య కాదు, హత్య అని, రియా నే తెలివిగా సుశాంత్ ని చంపేసింది అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి.

    సీబీఐ కూడా దీనిపై విచారణ జరిపి రియా చక్రవర్తి ని అనేకసార్లు విచారించారు. కానీ ఇందులో రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదని తేలడంతో ఆమె ఈ కేసు నుండి బయటపడింది. కానీ సుశాంత్ సింగ్ మాలాకద్రవ్యాలకు బానిసై మాత్రమే ఆత్మహత్య చేసుకున్నాడని, అందుకు కారణం రియా చక్రవర్తి మాత్రమే అని సుశాంత్ అని అభిమానించే లక్షలాది మంది అభిమానులు బలంగా నమ్ముతున్నారు. సోషల్ మీడియా లో ఆమెపై ఇప్పటికీ ఒక రేంజ్ ట్రోలింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె జిరోధా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తో ప్రేమలో మునిగి తేలుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా వీళ్లిద్దరు కలిసి బైక్ మీద వెళ్తున్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. రియా చక్రవర్తి బైక్ వెనుక మాస్క్ వేసుకొని కూర్చోగా, నిఖిల్ హెల్మెట్ పెట్టుకున్నాడు. ఈ ఫోటోని చూసి నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నిండు నూరేళ్లు ఎంతో సంతోషంగా బ్రతకాల్సిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జీవితాన్ని మింగేసి, అతన్ని పూర్తిగా మర్చిపోయి వేరొకరితో రిలేషన్ పెట్టుకుంటావా?, నిజంగా ఎవరినైనా ఒకరు నిజాయితితో ప్రేమిస్తే ఇలా చేస్తారా అంటూ రియా చక్రవర్తి పై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుపడుతున్నారు.

    సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మన తెలుగు ఆడియన్స్ కి మహేంద్ర సింగ్ ధోని బియోపిక్ ద్వారా సుపరిచితమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయనకీ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్స్ వచ్చాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇంత దూరం వచ్చిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని ఇప్పటికీ అభిమానిస్తూనే ఉంటారు ఆయన అభిమానులు. అలాగే రియా చక్రవర్తి ‘తూనీగ తూనీగ’ అనే తెలుగు సినిమా ద్వారానే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది కానీ, ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. కేవలం ఆమె సుశాంత్ ప్రేయసి గానే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె టీవీ సిరీస్ లో రెగ్యులర్ గా కనిపిస్తుంది.