https://oktelugu.com/

ఆధునిక ద్రౌపదిగా ‘రియా చక్రవర్తి’.. పర్ఫెక్ట్ అంతే

‘రియా చక్రవర్తి’ సుశాంత్ కేసులో, ఆ తరువాత డ్రగ్స్ కేసులో ఇండియా వైడ్ గా హల్ చల్ చేసిన బోల్డ్ బ్యూటీ. నిజంగా రియా తప్పు చేసిందో లేదో తెలియదు గానీ, ఎన్నో అనుమానాలు మరెన్నో అపవాదులు భరించాల్సి వచ్చింది. చివరికి, జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. సుశాంత్ కేసు నుండి బయటపడే లోపు అంతలో డ్రగ్స్ కేసు ఆమె మెడకు చుట్టుకుంది. మొత్తమ్మీద నెలలు గడిచిపోయాయి. ఈ క్రమంలో తన జీవితం తనది అన్నట్లుగా […]

Written By:
  • admin
  • , Updated On : June 10, 2021 / 06:02 PM IST
    Follow us on


    ‘రియా చక్రవర్తి’ సుశాంత్ కేసులో, ఆ తరువాత డ్రగ్స్ కేసులో ఇండియా వైడ్ గా హల్ చల్ చేసిన బోల్డ్ బ్యూటీ. నిజంగా రియా తప్పు చేసిందో లేదో తెలియదు గానీ, ఎన్నో అనుమానాలు మరెన్నో అపవాదులు భరించాల్సి వచ్చింది. చివరికి, జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. సుశాంత్ కేసు నుండి బయటపడే లోపు అంతలో డ్రగ్స్ కేసు ఆమె మెడకు చుట్టుకుంది. మొత్తమ్మీద నెలలు గడిచిపోయాయి.

    ఈ క్రమంలో తన జీవితం తనది అన్నట్లుగా సైలెంట్ అయిపోయి, మీడియాకి సైడ్ అయిపోయింది రియా. ఐతే మొత్తానికి రియా 2021లో తన జీవితాన్ని ఫ్రెష్ గా రీస్టార్ట్ చేయడానికి కసరత్తులు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మళ్ళీ సినిమాల్లో నటించేందుకు ఫిల్మ్ మేకర్స్ చుట్టూ తిరుగుతూ ఛాన్స్ ల కోసం గత కొన్ని నెలలుగా విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది.

    ఎట్టకేలకు ఆమె ప్రయత్నాలకు ఫలితం దక్కినట్టుగా తెలుస్తోంది. మహాభారతాన్ని ప్రేరణగా తీసుకుని ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర ద్రౌపది జీవితాన్ని పోలి ఉంటుంది. అంటే ఆధునిక ద్రౌపది అన్నమాట. ఇప్పుడు ఈ పాత్రలో నటించమని రియాను సంప్రదించారని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ సినిమా ఇంకా ప్రారంభ దశలోనే ఉందని సమాచారం.

    మొత్తానికి రియా ఆధునిక ద్రౌపదిగా ఒదిగి పోవడానికి అంగీకరించిందట. రియాకి సినిమా ఛాన్స్ లు రావడానికి కొంతమంది ఆమె పాత ఫ్రెండ్స్ ఆమెకు హెల్ప్ చేస్తోన్నారట. ఇక రియా చక్రవర్తి, అమితాబ్‌ బచ్చన్‌, ఇమ్రాన్‌ హష్మీలతో కలిసి నటించిన ‘చెహ్రే’ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా హిట్ అయి, రియాకి పేరు వస్తే ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.