Kolkata Doctor Case: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న బెంగాల్ సీఎం మమత.. ఇప్పుడు పాకులాడితే ఏం లాభం?

మెడికోపై లైంగికదాడి.. హత్య అనంతరం బెంగాళ్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను ముమ్మరం చేసింది. అయితే దీన్ని చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక యాప్ ప్రారంభించడం.. మహిళల భద్రత గురించి మాట్లాడడంపై దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల భద్రతపై ప్రభుత్వం ముందే ఆలోచిస్తే ఒక మెడికో చనిపోయేది కాదని అంటున్నారు.

Written By: Neelambaram, Updated On : August 18, 2024 5:26 pm

Kolkata Docctor Case

Follow us on

Kolkata Doctor Case:  కోల్‌కతాలోని ఆర్‌జీ‌కేర్ మెడికల్ వైద్య కళాశాలలో మెడికోపై లైంగికదాడి, హత్య కేసులో న్యాయం చేయాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ఉద్యమం జరుగుతోంది. వైద్య సిబ్బందికి పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించానే డిమాండ్ ఎక్కవైంది. ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం అడుగు ముందుకు వేశారు. టీఎంసీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ లో ‘రాట్రర్ సతి’ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ యాప్ ద్వారా నైట్ డ్యూటీ చేసే మహిళలకు భద్రత కల్పించనున్నారు. నైట్ డ్యూటీ చేసే మహిళల కోసం బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ విడుదల చేసింది. నైట్ డ్యూటీ చేసే మహిళలు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ఈ యాప్‌ ద్వారా సాయం పొందవచ్చు. మహిళల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు మమత ప్రభుత్వం ప్రకటించింది. మహిళా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల భద్రత కోసం బెంగాల్ ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాత్రి షిఫ్టుల్లో పనిచేసే వారి కోసమే ఈ ప్రత్యేక కార్యక్రమం. ఆర్‌జీ కర్‌లో డాక్టర్‌పై హత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఆర్జీ కర్‌కు చెందిన వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటన మహిళల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తింది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం శనివారం కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది. అనేక శాఖల చొరవతో రేటరర్ సతి ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అలపన్ బెనర్జీ ప్రకటించారు. మెడికల్ కాలేజీల్లో పోలీసుల పెట్రోలింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. మహిళా వైద్యులు, నర్సుల డ్యూటీ 12 గంటలకు మించకూడదని ఆదేశాలు జారీ చేశారు. అయితే మహిళా వైద్యులకు సాధ్యమైనంత వరకు రాత్రి విధుల్లో ఏమైనా సడలింపులు ఇస్తారా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ఆయన ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం కింద నైట్ డ్యూటీ సమయంలో ఇద్దరు మహిళలు కలిసి లేదా ఒక టీమ్ వర్క్ అప్పగించాలని కూడా సూచన చేసింది. సెక్యూరిటీ గార్డుల రిక్రూట్‌మెంట్‌లో స్త్రీ-పురుష నిష్పత్తిపైనా రాష్ట్రం దృష్టి సారిస్తున్నది.

మహిళా వైద్యులకు మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు
మహిళా వైద్యులకు ప్రత్యేక మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. వారు పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఉండేలా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించింది. ప్రత్యేక యాప్‌ను రూపొందించి.. దీని ద్వారా వైద్యులను, స్థానిక పోలీసు స్టేషన్‌లకు అనుసంధానం చేస్తారు. ఆసుపత్రుల మహిళా వైద్యులందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం తప్పనిసరి. వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో స్థానిక పోలీసులతో నిత్యం రాత్రి పెట్రోలింగ్‌ ఉండేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

కోల్‌కతాతో పాటు జిల్లాల్లోనూ ఈ విధానాన్ని అవలంబించాలని, ఒక మహిళా డాక్టర్‌కు నైట్‌ డ్యూటీ కేటాయిస్తే, ఆమెతో పాటు మరో మహిళా వైద్యురాలిని విధుల్లో ఉండేలా షిప్ట్‌లు నిర్ణయించనున్నట్లు ప్రకటించింది. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ మార్గదర్శకాలను పాటించాలని ఆదేశఆలు జారీ చేసింది. జిల్లాలతోపాటు కోల్‌కతాలోనూ ఈ విధానాన్ని అవలంబించాలని ఆదేశించింది.

9 రోజులుగా వైద్యుల సమ్మె
మెడికో హత్యాచార ఘటనపై బెంగాల్ లో తొమ్మిది రోజులుగా వైద్యుల సమ్మె కొనసాగుతోంది. ఈ ఘటనకు నిరసనగా జూనియర్, సీనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా 24 గంటల దేశవ్యాప్త సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అన్ని వైద్యశాలల్లో ఔట్ పేషెంట్ సేవలు నిలిచిపోయాయి. దీనిపై ఆయా రాష్ట్రాల్లోని వైద్య సిబ్బంది స్పందించారు.