https://oktelugu.com/

Photo Story: టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు పాన్ వరల్డ్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా?

చిన్నతనం లో ఉన్నప్పుడు ఆమె తన స్కూల్ లో తీసుకున్న ఫోటో ఇది. 'ఇష్టం' అనే చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈమె అతి తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Written By:
  • Gopi
  • , Updated On : August 18, 2024 / 05:02 PM IST

    Photo Story(1)

    Follow us on

    Photo Story: స్కూల్ డ్రెస్ లో ఎంతో క్యూట్ గా, ముద్దుగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?, ఈమె పెద్దయ్యాక కోట్లాది మంది కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సీనియర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి హీరోలతో పాటు నేటి తరం స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు ప్రభాస్ వంటి హీరోల సినిమాల్లో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. కేవలం తెలుగు లో మాత్రమే కాదు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో ఉండే అగ్రహీరోలతో కలిసి ఈమె ఎన్నో సినిమాలు చేసింది. అంతే కాదు హాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టి అక్కడ కూడా హీరోయిన్ గా రాణించింది. మన చిన్నతనంలో ఈమెని ఇష్టపడని వారంటూ బహుశా ఎవ్వరూ ఉండరేమో, ఇప్పటికీ కూడా ఈమె క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీబిజీ గా గడుపుతుంది. ఆమె మరెవరో కాదు శ్రీయ శరన్.

    చిన్నతనం లో ఉన్నప్పుడు ఆమె తన స్కూల్ లో తీసుకున్న ఫోటో ఇది. ‘ఇష్టం’ అనే చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈమె అతి తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నేటి తరం స్టార్ హీరోలలో ఈమె కేవలం ఒక్క అల్లు అర్జున్ తో మాత్రమే నటించలేదు. భవిష్యత్తులో ఆయనతో కూడా సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. నాలుగు పదుల వయస్సు దాటినా ఈ హాట్ బ్యూటీ చివరిసారిగా మన తెలుగు ఆడియన్స్ కి కనిపించిన చిత్రం ‘#RRR’. ఆ తర్వాత ఈమె బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. ఈ ఏడాది ఆమె డిస్నీ + హాట్ స్టార్ లో టెలికాస్ట్ అయిన ‘షో టైం’ అనే వెబ్ సిరీస్ లో ముఖ్యపాత్ర పోషించింది. ఆ తర్వాత మళ్ళీ ఆమె ఏ సినిమా చేయబోతుంది అనేది క్లారిటీ లేదు. 2018 వ సంవత్సరం లో ఈమె యాండ్రు కొస్చేవ్ అనే అతన్ని ప్రేమించి పెళ్లాడింది. వీళ్లిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు.

    Photo Story(2)

    పెళ్ళైన తర్వాత కూడా శ్రీయా శరన్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ ఎందుకో మేకర్స్ మాత్రం అంతగా ఆసక్తి చూపించడం లేదు. హీరోయిన్ పాత్రలకు ఆమె దూరమై చాలా కాలమే అయ్యింది. ఇప్పుడు ఎక్కువగా ఆమెకు క్యారక్టర్ రోల్స్ మాత్రమే వస్తున్నాయి. అవి చేసేందుకు కూడా ఆమె రెడీ గానే ఉంది. నెగటివ్ రోల్స్ , అడల్ట్ రోల్స్, బోల్డ్ రోల్స్ ఆమె ఇప్పటి వరకు చెయ్యలేదు. కానీ ఎవరైనా మంచి పవర్ ఫుల్ నెగటివ్ రోల్ ఇస్తే చేసేందుకు సిద్ధం గా ఉన్నానని రీసెంట్ గా ఆమె పలు ఇంటర్వ్యూస్ లో చెప్పింది. మరి ఆమెలోని ఈ సరికొత్త యాంగిల్ ని బయటపెట్టే డైరెక్టర్ ఎవరో చూడాలి.