
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరింత వేగం పెంచాడు. ఒకే సారి మూడు సినిమాలు చేస్తున్నాడు. ఆ మూడూ డిఫరెండ్ చిత్రాలే కావడం విశేషం. అందులో ఒకటి ‘నగ్నం’. ఇటీవలే పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే మూవీతో ముందుకొచ్చాడు. ఆర్జీవీ వరల్డ్ ద్వారా ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ఈ చిత్రానికి అనూహ్య స్పందన వచ్చింది. ఆ వెంటనే నగ్నం చిత్రం ట్రైలర్ను విడుదల చేశాడు. చీర కట్టుకున్న ఓ మహిళ శరీరభాగాలపై ఫోకస్ పెట్టి ఒకటిన్నర నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ను కట్ చేశాడు. నాక్‌డ్, నంగా, నగ్నం అన్న పేర్లు ఉండడంతో దీన్ని తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజ్ చేస్తారని అర్థమవుతోంది. దీన్ని చూడాలంటే రూ. 200 చెల్లించాల్సి ఉంటుందని ఆర్జీవీ ప్రకటించాడు.
‘నగ్నం’ ట్రైలర్ విడుదలైన రెండు గంటల్లోనే రాము మరో రెండు సినిమాలను అనౌన్స్ చేశాడు. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే మీద ఓ సినిమా తీస్తున్నట్టు తెలిపాడు. దీనికి ‘ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ’ అని టైటిల్ ఖరారు చేశాడు. గాంధీని చంపిన గాడ్సే తనను తానే చంపుకున్నాడని పేర్కొంటూ ఈ మూవీ విశేషాలను ట్విట్టర్లో చెబుతున్నాడు ఆర్జీవీ. అలాగే, ‘కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్’ అనే మరో మూవీ తీస్తున్నట్టు ప్రకటించాడు. ఓ ఇంట్లో మందుకొడుతున్న నలుగురు కుర్రాళ్లు గోడపై కత్రినా కైఫ్ ఫొటోను చూస్తున్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. కరోనా నేపథ్యంలో థియేటర్ల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఫూచర్ సినిమా.. థియేటర్, ఓటీటీలో కాదు కేవలం పర్సన్ యాప్స్‌లో చూడాల్సి ఉంటుందని వర్మ ట్వీట్ చేశాడు.
గాంధీ ముఖంలో గాడ్సే
‘ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ’ చిత్రం వివాదాస్పదమయ్యేలా ఉంది. ఈ మూవీ ప్రకటనతోనే సంచలనానికి తెరలేపిన ఆర్జీవీ తాజాగా ఓ పోస్టర్రిలీజ్ చేశాడు. అందులో గాంధీ, గాడ్సే ఇద్దరి ముఖాలను కలిపివేశాడు. కళ్లజోడు పెట్టుకున్న జాతిపిత ఫొటోను మార్పింగ్ చేసి గాడ్సే ఫొటోను అతికించిన పోస్టర్ పై ఇప్పటికే సామాజిక కార్యకర్త బాబు గోగినేని అసహనం వ్యక్తం చేశారు. హత్యచేసిన వ్యక్తి, హత్యకు గురైన వ్యక్తుల ఫొటోలను మార్పింగ్ చేస్తూ ఇలా పోస్టర్ విడుదల చేయడం సరికాదన్నారు. ఏమిటి, ఈ అకతాయితనం అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. కానీ, తనది భావ ప్రకటనా స్వేచ్ఛ అని, డైరెక్టర్ గా క్రియేటివిటీ చూపించడం నా హక్కు అని ఆర్జీవీ తనదైన స్టయిల్లో జవాబిచ్చాడు. ‘మార్ఫింగ్ చేసిన ఈ పోస్టర్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం సినిమా పూర్తిగా చుసిన తర్వాత తెలుస్తుంది. సినిమాను చూడకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేసే హక్కు మీకు లేదు. పోయి బీరు తాగి ప్రశాంతంగా ఉండండి’ అని సలహా ఇచ్చాడు.
The idea behind this image of the amalgamation is like Godse killing himself by killing Gandhi pic.twitter.com/zW69N4q6aR
— Ram Gopal Varma (@RGVzoomin) June 10, 2020
https://twitter.com/RGVzoomin/status/1270566259843756034
Forget THEATRES , the FUTURE of CINEMA is not even on OTT ‘s but it will be only on PERSONAL APPS pic.twitter.com/aUaO8ySuDw
— Ram Gopal Varma (@RGVzoomin) June 10, 2020