హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్..

కరోనా మహమ్మరి హైదరాబాద్ మహానగంలో విజృంభిస్తుంది. కరోనా వారియర్స్ అయిన వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టులు కరోనా బారిన పడడం శోచనీయంగా మారింది. ఇటీవలే నిమ్స్ ఆస్పత్రిలో వైద్య సిబ్బందికి కరోనా సోకింది. దీంతో నిమ్స్ లో తాత్కాలికంగా వైద్యసేవలు నిలిపివేసిన సంగతి తెల్సిందే. కరోనా సమాచారం ప్రజలకు సేవలందిస్తూ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలందిస్తున్న జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడుతున్నారు.ఇటీవలే మనోజ్ అనే జర్నలిస్టు కరోనా సోకి చికిత్స పొందుతూ మృతిచెందాడు. తాజాగా […]

Written By: Neelambaram, Updated On : June 11, 2020 2:40 pm
Follow us on


కరోనా మహమ్మరి హైదరాబాద్ మహానగంలో విజృంభిస్తుంది. కరోనా వారియర్స్ అయిన వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టులు కరోనా బారిన పడడం శోచనీయంగా మారింది. ఇటీవలే నిమ్స్ ఆస్పత్రిలో వైద్య సిబ్బందికి కరోనా సోకింది. దీంతో నిమ్స్ లో తాత్కాలికంగా వైద్యసేవలు నిలిపివేసిన సంగతి తెల్సిందే. కరోనా సమాచారం ప్రజలకు సేవలందిస్తూ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలందిస్తున్న జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడుతున్నారు.ఇటీవలే మనోజ్ అనే జర్నలిస్టు కరోనా సోకి చికిత్స పొందుతూ మృతిచెందాడు. తాజాగా పోలీస్ శాఖను కరోనా భయాందోళనకు గురిచేస్తోంది.

ఏడుగురు పోలీసులకు కరోనా..
హైదరాబాద్లో కరోనా డెంజర్ బేల్స్ మోగుతూనే ఉన్నాయి. రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళనను రేపుతోంది. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏడుగురి సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. వారందరికీ హోం క్వారంటైన్ చేశారు. పోలీస్ యంత్రాంగం బాధితుల ప్రైమరీ కాంటాక్టులను సేకరించి వారిని క్వారంటైన్లో ఉంచి టెస్టులు నిర్వహిస్తున్నారు.

కరోనాపై పోరాడుతున్న కరోనా వారియర్స్ ఈ మహ్మమరి బారిన పడుతుంటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైద్యులు, మెడికల్ విద్యార్థులు, వైద్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు ఎవరిని కరోనా వదలడం లేదు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తుంది. కాగా బుధవారం నాడు జీహెచ్ఎంసీ పరిధిలో 143 కేసులు నమోదయ్యాయి. ఇందులో మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో 11చొప్పున నమోదు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 4,111కు చేరగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,138గా ఉంది.