https://oktelugu.com/

అరియనా క్యారెక్టర్ అలాంటిదే… వర్మ సంచలన కామెంట్స్

వర్మను ఇంటర్వ్యూ చేసే వరకు యాంకర్ అరియనా అంటే ఎవరికీ తెలియదు. ఒక్క ఇంటర్వ్యూతో ఆమెను సూపర్ పాప్యులర్ చేశాడు వర్మ. ‘ఇప్పటి వరకు మీకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరు? అని వర్మను అరియనా అడుగగా ‘నువ్వే…’ అంటూ టక్కున సమాధానం చెప్పాడు వర్మ. అలాగే నిన్ను నాకు బికినీలో చూడాలని ఉందని వర్మ ఆమెతో చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. సదరు వీడియోలు వర్మ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అరియనా మరింత […]

Written By:
  • admin
  • , Updated On : December 20, 2020 / 01:53 PM IST
    Follow us on


    వర్మను ఇంటర్వ్యూ చేసే వరకు యాంకర్ అరియనా అంటే ఎవరికీ తెలియదు. ఒక్క ఇంటర్వ్యూతో ఆమెను సూపర్ పాప్యులర్ చేశాడు వర్మ. ‘ఇప్పటి వరకు మీకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరు? అని వర్మను అరియనా అడుగగా ‘నువ్వే…’ అంటూ టక్కున సమాధానం చెప్పాడు వర్మ. అలాగే నిన్ను నాకు బికినీలో చూడాలని ఉందని వర్మ ఆమెతో చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. సదరు వీడియోలు వర్మ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అరియనా మరింత పాప్యులర్ అయ్యారు. ఆ ఫేమ్ తోనే అరియనాకు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే అవకాశం వచ్చింది.

    Also Read: సంక్రాంతికి బరిలో దిగిన పందెం కోళ్లు

    బిగ్ బాస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అరియనా లక్షల్లో ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. ప్రతి టాస్క్ కోసం వంద శాతం కష్టపడుతూ, నిర్ణయాలు నిర్భయంగా వెల్లడిస్తూ బోల్డ్ లేడీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఫేక్ గేమ్ కి దూరంగా రియల్ గేమ్ ఆడిన కంటెస్టెంట్ గా అరియనా పేరు సంపాదించారు. కాగా వర్మ సైతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అరియానాకు మద్దతు తెలిపాడు. టైటిల్ గెలిచే అర్హత కేవలం అరియనాకు మాత్రమే ఉందన్న ఆయన, అందరూ ఓటు వేయాలని సోషల్ మీడియాలో సందేశం ఇచ్చారు.

    Also Read: బిగ్ బాస్ లీక్: విన్నర్, రన్నర్ ఎవరో కూడా తెలిసిపోయింది!

    కాగా అరియనా నేచర్ గురించి వర్మ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజా ఇంటర్వ్యూలో అరియనా గురించి అడుగగా… ఇంటర్వ్యూలోనే అరియానా బోల్డ్ లేడీ అని అర్థం అయ్యింది అన్నాడు. ఎటువంటి సిగ్గు లేకుండా తనను ప్రశ్నలు అడిగిందని వర్మ అన్నాడు. ఆమె క్యారెక్టర్ నాకు అప్పుడే అర్థం అయ్యిందని వర్మ చెప్పారు. గతంలో బిగ్ బాస్ అంటే కూడా నాకు తెలియదు, అది అంత ప్రాచుర్యం లేని షో అని చెప్పిన వర్మ, అరియనాకు ఈ రేంజ్ లో సపోర్ట్ చేయడం విశేషం. అయితే అరియనా టైటిల్ రేసు నుండి తప్పుకున్నట్లు, ఆమెకు తక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం అందుతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్