చాలా సందర్భాల్లో మనం చేసే చిన్నచిన్న తప్పులే ఆరోగ్య సమస్యల బారిన పడటానికి కారణమవుతుంటాయి. బ్రాండెడ్ కంపెనీల ఉత్పత్తులని నమ్మి కొన్ని ఉత్పత్తులను మనం కొనుగోలు చేస్తూ ఉంటాం. కానీ ఆ ఉత్పత్తులలో ఉండే కెమికల్స్ తాత్కాలికంగా ఎటువంటి ప్రభావం చూపకపోయినా దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. మనం ప్రతిరోజూ టూత్ పేస్ట్ ను వినియోగిస్తూ ఉంటాం.
అయితే ఆ టూత్ పేస్ట్ యొక్క లైఫ్ టైమ్ ను పెంచాలనే ఉద్దేశంతో కొన్ని కంపెనీలు వాటిలో ట్రైక్లోసన్ ను కలుపుతున్నాయి. ఈ ట్రైక్లోసన్ వల్ల శరీరంలోని నరాలు బలహీనపడుతున్నాయి. ట్రైక్లోసన్ కెమికల్ దీర్ఘకాలంలో తీవ్ర దుష్ప్రభావాలకు కారణమవుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. దాదాపు ఆరు దశాబ్దాల క్రితమే శాస్త్రవేత్తలు ట్రైక్లోసన్ వినియోగంపై నిషేధం విధించారు. పలు దేశాల్లో ట్రైక్లోసన్ ను టూత్ పేస్ట్, సబ్బులను తయారు చేసే కంపెనీలు వినియోగించకూడదని ఆదేశాలు ఉన్నాయి.
ట్రైక్లోసన్ మోతాదుకు మించి ఉంటే నాడీ వ్యవస్థలోని కణాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ సైతం ట్రైక్లోసన్ వాడకంపై నిషేధం విధించిందంటే ఈ కెమికల్ ఎంత ప్రమాదకరమో సులభంగానే అర్థమవుతుంది. కంపెనీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ కెమికల్ ను వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. పలు దేశాలకు ఈ కెమికల్ దుష్ప్రభావాలు తెలిసినా వేర్వేరు కారణాల వల్ల ఆయా దేశాలు ఈ కెమికల్ ను నియంత్రించలేకపోతున్నాయి.
పెద్దలతో పోల్చి చూస్తే పిల్లలపై ఈ కెమికల్ మరింత ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రజలు ఈ కెమికల్ లేని ఉత్పత్తులను వినియోగిస్తే మంచిది. ఈ కెమికల్ ఉన్న ఉత్పత్తులను వినియోగిస్తే మాత్రం ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.