Subhashree Engagement: నేడు ఉదయం తెల్లవారు జామున అక్కినేని అఖిల్(Akkineni Akhil) వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా అఖిల్ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతలోపే బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి మంచి క్రేజ్ ని సంపాదించుకున్న శుభశ్రీ(Subhashree Rayaguru) కూడా నిశ్చితార్థం చేసుకోవడం, అందుకు సమందించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం వంటివి హాట్ టాపిక్ గా మారింది. నిన్న రాత్రి ఆమె నిశ్చితార్థం చేసుకుందట. ఈ విషయాన్నీ స్వయంగా శుభశ్రీ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. చాలా కాలం నుండి ఈమె అజయ్ మైసూరు అనే అబ్బాయితో ప్రేమలో ఉన్నది. అతనితో డేటింగ్ కూడా చేస్తూ వచ్చింది. ఇష్టాయిష్టాలు బాగా కలవడం, ఇరు కుటుంబ సభ్యులు కూడా జంట వివాహానికి ఆమోదం తెలపడంతో నిన్న ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు.
Also Read: జూన్ 12 న ‘హరి హర వీరమల్లు’ సినిమా వస్తుంది అనుకున్నారు..కానీ ట్రైలర్ వస్తోంది..సినిమా ఎప్పుడో!
ఈ నిశ్చితార్ధ వేడుకకు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ హాజరయ్యారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు శుభశ్రీ టేస్టీ తేజ, యావర్, గౌతమ్ తదితరులతో మంచి స్నేహం గా ఉండేది. హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఈమె టేస్టీ తేజ తో ఎక్కువగా క్లోజ్ గా ఉంటూ వచ్చింది. గౌతమ్ తో హౌస్ లోపల చిన్నపాటి లవ్ ట్రాక్ కూడా నడిపిన సంగతి తెలిసిందే. కానీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ. అయితే నిన్న జరిగిన నిశ్చితార్ధ వేడుకకు టేస్టీ తేజ,యావర్ హాజరయ్యారు. కానీ మిగిలిన కంటెస్టెంట్స్ ఎందుకో ఈ ఈవెంట్ లో కనిపించలేదు. బహుశా మిగిలిన వాళ్లంతా పెళ్ళికి వస్తారేమో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. శుభ శ్రీ ఇప్పటి వరకు పెద్దగా సినిమాల్లో నటించలేదు, అదే విధంగా సీరియల్స్ లో కూడా నటించలేదు.
అయినప్పటికీ ఈమెకు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అనేక రీల్స్ చేస్తూ ఆమె యూత్ ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడిప్పుడే ఆమెకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘ఓజీ’ లో ఈమె ఒక కీలక పాత్ర పోషించింది. ఈ విషయాన్నీ స్వయంగా ఆమె తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. ఓజీ చిత్రం కోసం పవన్ అభిమానులు మాత్రమే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎంత ఆతృతగా ఎదురు చూస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం రావడమంటే శుభశ్రీ అదృష్టం అనే చెప్పాలి. ఈ సినిమా హిట్ అయితే కచ్చితంగా ఆమెకు టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావొచ్చు. చూడాలి మరి ఈ క్యూట్ బ్యూటీ అదృష్టం ఎలా ఉంది అనేది.