Hari Hara Veeramallu release date : ఈ నెల 12 న విడుదల అవ్వాల్సిన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం వాయిదా పడింది అనే విషయం గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అది ప్రచారం కాదు, నిజమే అనుకోండి, కానీ నిర్మాతల నుండి అధికారిక ప్రెస్ నోట్ మాత్రమే నేడే వచ్చింది. ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని ముందుగా ప్లాన్ చేసుకున్న విధంగా జూన్ 12 న విడుదల చేయడం లేదని, కొత్త విడుదల తేదీని త్వరలోనే బ్లాస్టింగ్ థియేట్రికల్ ట్రైలర్ తో అధికారికంగా గ్రాండ్ గా ప్రకటన చేస్తామని చెప్పుకొచ్చారు. సినిమా విడుదల కాకపోవడానికి సోషల్ మీడియా లో అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయని, వాటిని అసలు నమ్మొద్దని, ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించడం కోసం మరింత సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చారు.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 12 న విడుదల చేయబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఆ థియేట్రికల్ ట్రైలర్ తోనే సినిమా విడుదల తేదీ కూడా తెలియనుంది. ఒకవేళ 12 న కుదరకపోతే 15 న అయినా విడుదల చేయాలనీ అనుకుంటున్నారు మేకర్స్. ‘వకీల్ సాబ్’ ట్రైలర్ లాంచ్ ఎలా జరిగిందో మన అందరం అంత తేలికగా మర్చిపోలేం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. రెస్పాన్స్ సెన్సేషనల్ గా వచ్చింది. నేషనల్ లెవెల్ లో ఈ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ గురించి అంతా మాట్లాడుకున్నారు. మళ్ళీ అలాంటి ఫీట్ ని ‘హరి హర వీరమల్లు’ చిత్రం ట్రైలర్ తో రిపీట్ చేయాలనీ చూస్తున్నారు మేకర్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ లో గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు సమాచారం.
Also Read : మొదలైన ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..అప్పుడే అంత గ్రాస్ వచ్చిందా?
వకీల్ సాబ్ చిత్రానికి అకస్మాత్తుగా హైప్ విపరీతంగా పెరగడానికి ముఖ్య కారణం ట్రైలర్ లాంచ్ కి వచ్చిన రెస్పాన్స్. ఈ చిత్రానికి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందని, కనీవినీ ఎరుగని రేంజ్ హైప్ క్రియేట్ అవుతుందని అభిమానులు బలమైన నమ్మకం పెట్టుకున్నారు. అంభిమానుల పెట్టుకున్న ఆ నమ్మకాలు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి. ఈ ట్రైలర్ లో సినిమా ఎంత గ్రాండ్ గా తీశారో చూపిస్తారంట. సముద్రం తో పాటు, క్రూర జంతువులూ కూడా ఈ ట్రైలర్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. పవన్ కల్యాణ అభిమానుల్లో కొంతమంది ఈ చిత్రాన్ని చాలా తక్కువ అంచనా వేసి చూస్తున్నారని. ట్రైలర్ చూసిన తర్వాత వాళ్లంతా ఆశ్చర్యానికి గురి అవుతారని నిర్మాత AM రత్నం రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. చూడాలి మరి కమర్షియల్ గా ఈ చిత్రం ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది.