Retro Movie : ఒకప్పుడు సూర్య(Suriya Sivakumar) సినిమాలు తమిళం లో ఫ్లాప్ అయినా, తెలుగు లో సూపర్ హిట్స్ గా నిలిచేవి. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఆయన సినిమాలు రెండు రాష్ట్రాల్లోనూ బయ్యర్స్ చేత రక్త కన్నీరు పెట్టిస్తున్నాయి. తమిళం లో ఫ్లాప్ అయితే, తెలుగు లో మెగా ఫ్లాప్ గా నిలుస్తున్నాయి ఆయన సినిమాలు. గతంలో తెలుగు లో సూర్య సినిమాలకు మినిమం గ్యారంటీ ఓపెనింగ్స్ ఉండేవి, ఇప్పుడు అది కూడా లేదు. రీసెంట్ గా విడుదలైనా ‘రెట్రో'(Retro Movie) చిత్ర పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రీసెంట్ గా వరుసపెట్టి హిట్స్ కొడుతూ మంచి ఊపు మీదున్న సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రం తెలుగు వెర్షన్ రైట్స్ ని పది కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు. సినిమా విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి కనీసం నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు.
Also Read : దసరా’ ని దాటేసిన ‘హిట్ 3’ కలెక్షన్స్..2 వారాల్లో ఎంత గ్రాస్ వచ్చిందంటే!
అంటే కనీసం 50 శాతం వసూళ్లు కూడా రీకవర్ కాలేదు అన్నమాట. ఇది డిజాస్టర్ కాదు, ఎపిక్ డిజాస్టర్ అని అనొచ్చు. ఆయన గత చిత్రం ‘కంగువా’ చిత్రానికి భారీ హైప్ ఉండడం వల్ల కనీసం ఓపెనింగ్ వసూళ్లు అయినా వచ్చాయి. దీనికి అది కూడా లేదు. ఆ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన మొదటి రోజు వసూళ్లు, దీనికి క్లోజింగ్ లో రావడం కూడా కష్టమే. మెల్లమెల్లగా సూర్య తెలుగు మార్కెట్ ని కోల్పోయాడు. ఆయన తదుపరి చిత్రం తెలుగులోనే అనే విషయం మన అందరికీ తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వం లో నాగవంశీ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కనుంది. పాపం రెట్రో దెబ్బకు ఇప్పుడు నాగవంశీ సూర్య తో సినిమా అంటే కాస్త భయం మొదలు అయ్యుండొచ్చు. ఇక ఇప్పటి వరకు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి కనీసం వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండు వారాల్లో 97 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటే సూర్య ఫ్యాన్స్ కి కాస్త కలెక్షన్స్ ని చెప్పుకోవడానికి బాగుంటుంది. తమిళనాడు లో కూడా ఈ వీకెండ్ తో ఈ చిత్రం అక్కడ 50 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. రెండు వారాలకు కలిపి అక్కడ ఈ చిత్రానికి కేవలం 48 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక ప్రాంతంలో 11 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, కేరళలో 4 కోట్ల 65 లక్షలు, ఓవర్సీస్ లో 24 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
Also Read : తల్లికి వందనం’ పథకం ‘హరి హర వీరమల్లు’ కు ఉపయోగపడనుందా..? ఎలా అంటే!