Hit3 Movie : నాని(Natural Star Nani) కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘దసరా’ నే. 2023 వ సంవత్సరం లో కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ఇరగకుమ్మేసింది. ఆంధ్ర లో మాత్రం అంతంత మాత్రంగానే ఆడింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 115 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి 63 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ వసూళ్లను నాని లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit : The Third Case) దాటేసింది. రెండు వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 116 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ పరంగా ‘దసరా’ చిత్రాన్ని దాటేసింది కానీ, షేర్ పరంగా దాటాల్సి ఉంది.
Also Read : తల్లికి వందనం’ పథకం ‘హరి హర వీరమల్లు’ కు ఉపయోగపడనుందా..? ఎలా అంటే!
ఈ వీకెండ్ తో షేర్ పరంగా కూడా ఈ చిత్రం ‘దసరా’ ని దాటే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. 50 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు థియేటర్స్ నుండి 10 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి. రెండవ వీకెండ్ లో భారీ రేంజ్ వసూళ్లు రాకపోవడం తో, సోమవారం నుండి వసూళ్లు బాగా పడిపోతాయని అంతా అనుకున్నారు. కానీ డీసెంట్ స్థాయి షేర్ వసూళ్లను నమోదు చేసుకుంటూ ఈ చిత్రం గడిచిన మూడు రోజులకు కలిపి కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సోమవారం రోజున 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, మంగళవారం రోజున 47 లక్షలు, బుధవారం రోజున 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు వారాలకు గాను తెలుగు రాష్ట్రాల్లో 39 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
నాని కెరీర్ లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. దసరా చిత్రానికి నైజాం ప్రాంతం భారీ వసూళ్లు వచ్చాయి. కానీ ‘హిట్ 3’ నైజాం ప్రాంతం లో దసరా రేంజ్ వసూళ్లు రాలేదు. రెండు వారాలకు గాను ఈ ప్రాంతం లో హిట్ 3 కి 17 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. 18 కోట్ల రూపాయిల షేర్ మార్కుని ఈ వీకెండ్ కి దాటుతుంది. కానీ దసరా నైజాం వసూళ్లను అందుకోవడం అసాధ్యం. ఆ ప్రాంతం లో ఈ చిత్రానికి 26 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ‘హిట్ 3’ కి 20 కోట్లు రావడం కూడా కష్టమే. ఓవరాల్ గా హిట్ 3 కి ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వీకెండ్ చాలా ముఖ్యం కానుంది.