Single Movie : శ్రీవిష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సింగిల్'(#Single Movie) ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని భారీ వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. కేవలం మొదటి వీకెండ్ తోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ స్థాయి షేర్ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకెళ్తుంది. సోమవారం రోజున 87 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మంగళవారం రోజున 72 లక్షలు, బుధవారం రోజున 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. రీసెంట్ గా విడుదలై ఆడియన్స్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘హిట్ 3’ చిత్రం ప్రస్తుత రోజువారీ వసూళ్లు కూడా ఈ రేంజ్ లో నమోదు అవ్వడం లేదు.
Also Read : రెట్రో’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..తెలుగు రాష్ట్రాల్లో ఎపిక్ డిజాస్టర్!
ఓవరాల్ గా ఆరు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 10 కోట్ల 84 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కేవలం 7 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి వారం రోజులు కూడా పూర్తి కాకముందే దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి. ఈ వీకెండ్ తో ఇంకా ఎక్కువ లాభాలను చూసే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం సీడెడ్ నుండి 91 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ తో నైజాం ప్రాంతం 5 కోట్ల రూపాయిల మార్కుని, సీడెడ్ లో కోటి రూపాయిల షేర్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇక కేరళ + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకు 2 కోట్ల 74 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 10 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఫుల్ రన్ లో శ్రీవిష్ణు కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ ని రాబట్టిన సినిమాగా నిల్చిన ‘సామజవరగమనా’ ని దాటుతుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమాకు దాదాపుగా 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వసూళ్లు వచ్చాయి. ‘సింగిల్’ చిత్రానికి కూడా ఇంచుమించు అంతే వచ్చేలా ఉన్నాయి, అంతకన్నా తక్కువ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Also Read : దసరా’ ని దాటేసిన ‘హిట్ 3’ కలెక్షన్స్..2 వారాల్లో ఎంత గ్రాస్ వచ్చిందంటే!