Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీ అప్డేట్ కోసం గత వారం రోజులుగా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నారు. కారణం విడుదల తేదీ ఫిక్స్ అవ్వడం వల్లే. జూన్ 12 అని కొందరు, జూన్ 13 అని మరికొందరు సోషల్ మీడియా లో ఎవరికీ తోచినట్టు వాళ్ళు ప్రకటించుకుంటూ ఉన్నారు. మూవీ టీం నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో అభిమానుల ఆవేశం కట్టలు తెంచుకుంది. #WakeUpTeamHHVM అనే ట్యాగ్ తో నేషనల్ వైడ్ గా ట్రెండ్ కూడా చేశారు. అయినప్పటికీ మూవీ టీం నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో అభిమానుల ఆవేశం తారాస్థాయికి చేరింది. అభిమానులు ఎంత కోపం ఉన్నారో అర్థం చేసుకున్న మూవీ టీం కాసేపటి క్రితమే ట్విట్టర్ లో అప్డేట్ రాబోతుంది అంటూ ఒక జిఫ్ వీడియో ని అప్లోడ్ చేసింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా యాక్టీవ్ అయిపోయారు.
Also Read : ‘పుష్ప 2’ మేకర్స్ చేతుల్లోకి ‘హరి హర వీరమల్లు’..ఇక ఫ్యాన్స్ కి ప్రతిరోజు పండగే!
ఈ చిత్రాన్ని జూన్ 12 న విడుదల చెయ్యాలని మేకర్స్ అధికారికంగా ఖరారు చేసారు. ఈమేరకు అన్ని ప్రాంతాలకు సంబంధించిన బయ్యర్స్ కి సమాచారం కూడా అందించారు. నేడు, లేదా రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే సోమవారం రోజున ఆ చిత్రం నిర్మాత AM రత్నం ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయబోతున్నాడని టాక్. ఈ ప్రెస్ మీట్ ద్వారా మూవీ కి సంబంధించిన విశేషాలు, ప్రొమోషన్స్ ప్రణాళిక, విడుదల తేదీ తదితర అంశాల పై మాట్లాడబోతున్నారు. ఇక అభిమానులకు ఈ చిత్రం నుండి రోజుకో అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 25న థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అదే రోజున ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంబిస్తారట. ట్రైలర్ కట్ ఇప్పటికే సిద్ధమైనట్టు తెలుస్తుంది.
రీసెంట్ గా విడుదలైన ట్రైలర్స్ అన్నిటికంటే ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ అద్భుతంగా ఉంటుందని, టాలీవుడ్ చరిత్ర లోనే ది బెస్ట్ ట్రైలర్ కట్స్ లో ఒకటిగా నిలిచిపోతుందని అంటున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ డబ్బింగ్ ఒక్కటే బ్యాలన్స్ ఉందట. ఎల్లుండి లోపు ఆయన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ ఉన్నాడు. నిన్నటి నుండి ఆయన షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ నెల 19 వ తేదీ వరకు హైదరాబాద్ లో షూటింగ్ జరగనుంది. ఆ తర్వాత మూవీ టీం మొత్తం ముంబై కి షిఫ్ట్ అవ్వనుంది. అక్కడ 8 రోజుల పాటు షూట్ చేస్తారట. తిరిగి వచ్చిన తర్వాత తాడేపల్లి లో కొన్ని కీలక సన్నివేశాలు, అదే విధంగా థాయిలాండ్ లో ఒక్క రోజు పాటు షూటింగ్ చేయాల్సిన అవసరం ఉందట. 19 తర్వాత హైదరాబాద్ లో ఉండే అవకాశం లేనందున ఆలోపు ‘హరి హర వీరమల్లు’ కి డబ్బింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.