https://oktelugu.com/

ఇంట్రెస్టింగ్.. పాతికేళ్లు వెనక్కి వెళ్లిన రేణుదేశాయ్..!

హీరోయిన్ రేణుదేశాయ్ తాజాగా పాతికేళ్ల వెనక్కి వెళ్లారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ రేణుదేశాయ్ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. తాజాగా తన చిన్ననాటి అనుభవాలను మరోసారి అభిమానులతో పంచుకున్నారు. ఆమె చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉండటంతో అభిమానులు చర్చించుకుంటున్నారు. Also Read: రవితేజ మీద పగ పట్టిన డైరెక్టర్ ! 1995 సెప్టెంబర్ 9న తాను తొలిసారి కెమెరాను ఫేస్ చేసినట్లు చెప్పారు. 16ఏళ్ల వయస్సులోనే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపారు. తాను అప్పుడే సినిమాలతో ప్రేమలో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 10, 2020 / 03:15 PM IST
    Follow us on

    హీరోయిన్ రేణుదేశాయ్ తాజాగా పాతికేళ్ల వెనక్కి వెళ్లారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ రేణుదేశాయ్ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. తాజాగా తన చిన్ననాటి అనుభవాలను మరోసారి అభిమానులతో పంచుకున్నారు. ఆమె చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉండటంతో అభిమానులు చర్చించుకుంటున్నారు.

    Also Read: రవితేజ మీద పగ పట్టిన డైరెక్టర్ !

    1995 సెప్టెంబర్ 9న తాను తొలిసారి కెమెరాను ఫేస్ చేసినట్లు చెప్పారు. 16ఏళ్ల వయస్సులోనే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపారు. తాను అప్పుడే సినిమాలతో ప్రేమలో పడిపోయినట్లు చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో అభిమానులందరికీ తెల్సిందేనన్నారు. ఇది జరిగి అప్పుడే పాతికేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నట్లు చెప్పారు.

    తాను నిజానికి సినిమా ఇండస్ట్రీలోకి వస్తానని అనుకోలేదని తెలిపారు. తనకు చిన్నతనం నుంచి అంతరిక్ష శాస్త్రవేత్త.. లేదా డాక్టర్ కావాలని కోరిక ఉండేదని చెప్పింది. కానీ విధి తన జీవితాన్ని మ‌రోలా ప్లాన్ చేసిందని.. పదేహారేళ్ల వయస్సులోనే కెమెరా ముందుకు రావాల్సి వచ్చిందని చెప్పారు. నాసాలో శాస్త్రవేత్త కావాలనుకున్న తన కలను వదులుకున్నందుకు చాలా బాధపడినట్లు తెలిపారు. ఆ బాధ తనను ఎన్నో ఏళ్లు వెంటాడిందని చెప్పుకొచ్చాడు.

    Also Read: శ్రావణి సూసైడ్ కేసులో ఓ నిర్మాత పేరు?

    ఈ సందర్భంగా తాను తొలిసారి కెమెరా ముందుకొచ్చినపుడే తీసిన ఫొటోను తన ఇన్ స్ట్రాగ్రామ్ లో రేణుదేశాయ్ పోస్టు చేశారు. సోషల్ మీడియాలో రేణు దేశాయ్ పోస్టు చేశారంటే ఏదో సమ్ థింగ్ స్పెషల్ ఉంటుందని ఊహించే అభిమానులకు అలాంటి సర్ ప్రైజే ఇచ్చారు. నాటి తీపి గుర్తులను ఆమె అభిమానులతో పంచుకొని పాతికేళ్ల వెనక్కి వెళ్లారు.