https://oktelugu.com/

రవితేజ మీద పగ పట్టిన డైరెక్టర్ !

‘ఆర్ ఎక్స్ 100’ అంటూ బోల్డ్ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ అజ‌య్ భూప‌తి, దాదాపు రెండు సంవత్సరాల నుండి ‘మహా సముద్రం’ అనే సినిమా చేయడానికి తెగ కిందామీదా పడుతూ మొత్తానికి మొన్న సినిమాని ఎనౌన్స్ చేయించుకున్నాడు. అయితే మొదట ఈ సినిమా చేస్తానని.. ఆ తరువాత ఈ సినిమా నుండి తప్పుకున్న మాస్ మహారాజా రవితేజ బాధ పడేలా తానూ ఈ సినిమాని హిట్ చేస్తానని.. నన్ను నా కథను కాదని సినిమా నుండి […]

Written By:
  • admin
  • , Updated On : September 10, 2020 / 03:20 PM IST
    Follow us on


    ‘ఆర్ ఎక్స్ 100’ అంటూ బోల్డ్ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ అజ‌య్ భూప‌తి, దాదాపు రెండు సంవత్సరాల నుండి ‘మహా సముద్రం’ అనే సినిమా చేయడానికి తెగ కిందామీదా పడుతూ మొత్తానికి మొన్న సినిమాని ఎనౌన్స్ చేయించుకున్నాడు. అయితే మొదట ఈ సినిమా చేస్తానని.. ఆ తరువాత ఈ సినిమా నుండి తప్పుకున్న మాస్ మహారాజా రవితేజ బాధ పడేలా తానూ ఈ సినిమాని హిట్ చేస్తానని.. నన్ను నా కథను కాదని సినిమా నుండి బయటకు వెళ్లిపోయినందుకు రవితేజ ఫీల్ అవ్వాలని ఈ డైరెక్టర్ అక్కడ ఇక్కడా తెగ పేలతన్నాడని.. మనోడు రవితేజ మీద పగ పట్టినట్లు మాట్లాడుతూ ఉన్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అజయ్ ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే.. అతను తీసిన ఆర్ ఎక్స్ 100 క్లాసిక్ సినిమా కాదు, అదొక బూతు సినిమా. పైగా ఆ సినిమా హిట్ అయిందంటే దానికి మెయిన్ కారణం.. పాయల్ రాజ్ పుత్ తనకున్న అందచందాలను పూర్తిగా ప్రదర్శించడమే.

    Also Read: అందుకే రోజా, ప్రియమణిలకు శేఖర్ మాస్టర్ దూరం !

    కేవలం పాయల్ బోల్డ్ తనమే ఆ సినిమా సక్సెస్ లో ముఖ్య భూమిక. ఇవ్వన్నీ ఆలోచించుకోకుండా అజయ్ కాస్త ఎక్కువ ఊహించుకుంటే మూడో సినిమా కూడా లేకుండానే కెరీర్ ముగిసిపోయే ప్రమాదం ఉంది. నిజానికి ఈ సినిమా నుండి నాగచైతన్య కూడా తప్పుకున్నాడు. సినిమాలో మ్యాటర్ ఉంటే.. మరీ చైతు ఎందుకు సినిమా నుండి తప్పుకున్నాడు. హీరో శర్వానంద్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. నిజమే.. తనకు హిట్ వచ్చి చాలా కాలం అయింది. ఒకవేళ శర్వా ఫామ్ లో ఉండి ఉంటే.. ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..? ఇస్తాడాని అనుకోలేం. ఏమైనా అజయ్ గత రెండు సంవత్సరాలు నుండి రాసిన సీన్స్ నే రాసుకుంటూ తన కథ గొప్ప క్లాసిక్ అని కలలు కంటునట్లు ఉన్నాడు. ఇక ఈ సినిమాలో శ‌ర్వానంద్ కి జ‌త‌గా బబ్లీ బ్యూటీ రాశి ఖన్నాని తీసుకోబోతున్నారట. ఇప్పటికే రాశి ఖన్నాకి అజ‌య్ కథ కూడా వివరించాడని.. సినిమాలో కాస్త బోల్డ్ సీన్స్ ఉంటాయని కూడా ఆమెకు చెప్పాడని.. అయినా కూడా రాశి ఖన్నా ఈ సినిమా చేయడానికి హ్యాపీగా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందని తెలుస్తోంది.

    Also Read: పాపం నిర్మాతలు.. తగ్గనంటున్న క్రియేటివ్ డైరెక్టర్ !

    మొత్తానికి రాశి ఖన్నా ఎక్స్ పోజింగ్ విషయంలో ఈ మధ్య కాస్త హద్దులు చేరిపేసుకునట్లు కనిపిస్తోంది. అయినా తానూ ఆడినంత రెమ్యునరేషన్ ఇవ్వాలంటే.. బోల్డ్ సీన్స్ కూడా ఒప్పుకోక తప్పదు. పైగా అమ్మడుకు ప్రసుతం కొత్త అవకాశాలు కూడా రావడం లేదు. వచ్చినా భారీగా డిమాండ్ చేస్తోంది. నా క్యారెక్టర్ కాస్త రొమాన్స్ ఎక్కువ చేయాల్సి వచ్చినా.. నేను చేస్తాను, రెమ్యునరేషన్ విషయంలో మాత్రం నేను తగ్గను అంటుందట. అన్నట్టు ఈ సినిమాలో మరో హీరో పాత్ర కూడా ఉంది. ఇప్పుడు ఆ పాత్ర కోసమే.. అజయ్, తమిళంలో ఫామ్ లో ఉన్న యంగ్ హీరో అదర్వ్ కోసం ట్రై చేస్తున్నాడు. అదర్వ్ ఒప్పుకుంటే అప్పుడు తమిళంలో కూడా సినిమాకి బాగా మార్కెట్ అవుతుందని అజయ్ ఆశ. మరి ఏమవుతుందో చూడాలి.