Homeక్రీడలుక్రికెట్‌Suryakumar Yadav future: T20 వరల్డ్ కప్ గెలిచినప్పటికీ.. సూర్యకు కష్టమే.. ఎందుకంటే

Suryakumar Yadav future: T20 వరల్డ్ కప్ గెలిచినప్పటికీ.. సూర్యకు కష్టమే.. ఎందుకంటే

Suryakumar Yadav future: 2024 లో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. నాడు భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించాడు. టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. రోహిత్ బాటలోనే విరాట్ కోహ్లీ కూడా నడిచాడు. రోహిత్ తర్వాత టి20 జట్టు నాయకత్వ బాధ్యతలను మేనేజ్మెంట్ సూర్య కుమార్ యాదవ్ కు అప్పగించింది.

సూర్య నాయకత్వంలో 2024 నుంచి ఇంతవరకు ఒక్క టోర్నీ కూడా కోల్పోలేదు. సూర్య సారధ్యంలో టీమిండియా గొప్ప విజయాలను సాధించింది. కాకపోతే స్వదేశం, విదేశాలలో ఎక్కడా కూడా టీమిండియా టోర్నీ కోల్పోలేదు. సూర్య ఆధ్వర్యంలో టీమిండియా ఆసియా కప్, టి20 వరల్డ్ కప్ సాధించింది. జట్టు పరంగా ప్రదర్శన విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. నాయకుడిగా అతడి కెప్టెన్సీకి వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఆటగాడికి మాత్రం అతడు విఫలమయ్యాడు. ఒకానొక సందర్భంలో జట్టు నుంచి సూర్యకుమార్ యాదవ్ ను తొలగించాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి. అయితే మేనేజ్మెంట్ అతడి మీద నమ్మకం ఉంచడంతో సూర్య కుమార్ యాదవ్ సారధిగా కొనసాగాడు.

టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. ఇదే విషయాన్ని అతని ఎదుట విలేకరులు ప్రస్తావిస్తే.. “ఇప్పుడు అంత బాగానే ఉంది. నేను వీడ్కోలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది. 2028 ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలి. ఇక అదే ఏడాది టి20 వరల్డ్ కప్ జరుగుతుంది. ఆ టోర్ని లో కూడా టీమ్ ఇండియా గెలవాలి. ఇవి నా భవిష్యత్తు లక్ష్యాలు” అని సూర్య కుమార్ యాదవ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ కు 35 సంవత్సరాలు. టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో అతడు 0 పరుగులు చేశాడు. టీమిండియా 300 స్కోర్ చేస్తుంది అనుకుంటున్న క్రమంలో.. అతడు బలమైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు..

సూర్య కుమార్ యాదవ్ భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకున్న క్రమంలో.. అంతంత మాత్రమైన ఆట తీరు కొనసాగిస్తున్న క్రమంలో.. మేనేజ్మెంట్ అతడిని కొనసాగిస్తుందా? అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది. మరోవైపు యంగ్ ప్లేయర్లు జాతీయ జట్టు చోటు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతిభావంతుల నుంచి ఎదురవుతున్న పోటీని సూర్యకుమార్ యాదవ్ ఎంతవరకు ఎదుర్కొంటాడు? ఆ పోటీని తట్టుకొని ఎలా నిలబడగలుగుతాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.

ఒకప్పుడు జట్టులో రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మకు బలమైన బాండింగ్ ఉండేది. అందువల్లే 2024లో రాహుల్ ద్రావిడ్ పదవి కాలం పూర్తయినప్పటికీ.. జట్టు కోచ్ గా కొనసాగాలని రోహిత్ శర్మ పదేపదే కోరాడు. ఇప్పుడు అదే తరహా బాండింగ్ సూర్య కుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ మధ్య ఉంది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో సూర్య కుమార్ యాదవ్ ఆడుతున్నప్పుడు గౌతమ్ గంభీర్ తో బలమైన పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వీరిద్దరూ సమన్వయంతో పనిచేయడం మొదలైంది. ఇప్పుడు జాతీయ జట్టులో కూడా వీరిద్దరూ అలానే ప్రయాణం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ నుంచి పూర్తిస్థాయిలో భరోసా వచ్చిందని.. అందువల్లే సూర్య కుమార్ యాదవ్ ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్.. 2028 లో టి20 వరల్డ్ కప్ సాధించడానికి లక్ష్యాలుగా పెట్టుకున్నాడని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version