Thalapathy Vijay Trisha: సముద్రంలో ఉప్పుకు.. చెట్టు మీద ఉన్న ఉసిరికి సంబంధం కలపడం అంత ఈజీ కాదు. కానీ సోషల్ మీడియా వల్ల అది అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రియేటర్లు అంతకుమించిన సంబంధాలను సృష్టిస్తున్నారు. కళ్ళు అలానే అప్పగించి చూసేలా.. మూతి మీద వేలు వేసుకొని ఆశ్చర్యపోయేలా.. వీడియోలను రూపొందిస్తున్నారు. అటువంటి వీడియోనే ఇది కూడా.
ఇప్పుడు సోషల్ మీడియాలో విజయ్, త్రిష సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. వీరిద్దరి మధ్య సంబంధం ఉందని తమిళ మీడియా కోడై కూస్తోంది. ఇక ఇతర పార్టీల నాయకులు చేస్తున్న ఆరోపణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా విజయ్ భార్య ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో విజయ్ విడాకుల సెటిల్మెంట్ కోసం 250 కోట్లను తన మొదటి భార్యకు ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత? అబద్ధం ఎంత? అనే విషయాలపై ఇంతవరకు అధికారికంగా క్లారిటీ లేదు.
విజయ్ త్రిష వ్యవహారం అలా సాగుతుండగానే.. కొంతమంది కంటెంట్ క్రియేటర్లు తెరపైకి దువ్వాడ శ్రీనివాస్, మాధురిని తీసుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ కు గతంలోని వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు కూడా. వారిద్దరూ పెళ్లి ఈడుకు వచ్చారు. గత ఏడాది తెలుగు మీడియా మొత్తం దువ్వాడ శ్రీనివాస్, మాధురి చుట్టూ తిరిగింది. యూట్యూబ్ ఛానల్స్ వారిద్దరిని ఇంటర్వ్యూలు చేసి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి.
దువ్వాడ శ్రీనివాస్ వివాహం చేసుకోకుండానే మాధురితో సంబంధం కొనసాగిస్తున్నారు. విజయ్ కూడా తన మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండానే త్రిషతో కలిసి ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంటెంట్ క్రియేటర్లు త్రిష, విజయ్, దువ్వాడ శ్రీనివాస్, మాధురికి లింక్ పెట్టి వీడియో రూపొందించారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.