Actress Hema: ఒకప్పుడు కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా గడిపారు నటి హేమ.అయితే ఈమధ్య కాలంలో సినిమాలతో కంటే వివాదాలతోనే హేమ ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు అత్తా , అక్క, అమ్మ పాత్రలు పోషిస్తుండడంతో హేమ కి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అయితే కొద్దినెలల క్రితం ఈమె కర్ణాటకలో వెలుగుచూసిన రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసులో హేమ అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే రిమాండ్ లో ఉన్నప్పుడు పోలీసులు న్యాయ విచారణ చేపట్టగా , ఈమె నిర్దోషి అని తేలింది. దీంతో మళ్లీ సినిమాల్లోకి కం బ్యాక్ ఇచ్చింది. గతంలో మాదిరిగా సినిమాలు చేయకపోయినా ఉన్నంతలో మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తున్నారు హేమ.
కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై హేమ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ ‘ అరెస్ట్ చేసిన తర్వాత ఒక మీడియా ఛానల్ తన పై ఫేక్ న్యూస్ ప్రచారం చేసింది, తప్పు నా వైపు లేకపోయినా ఇష్టమొచ్చినట్టు అన్యాయమైన ఆరోపణలు చేశారు. నా జీవితం లో ఎప్పుడూ అనుభవించని మానసిక వేదనని ఆ సమయం లో అనుభవించాను. అడక్కతినేవాళ్ళని తీసుకొచ్చి నన్ను తిట్టించారు, లైవ్ డిబేట్స్ పెట్టి నా పరువు మొత్తం తీసేసారు. కొన్ని మీడియా చానెల్స్ అయితే నన్ను తిట్టడం కోసం చాలానే ఖర్చు చేశారు’ అంటూ హేమా ఆవేదన వ్యక్తం చేసింది. హేమ రాజకీయ నాయకురాలు కాదు , గతం లో ఏ పెద్ద హీరో ని కూడా టార్గెట్ చేసి తిట్టినట్టు దాఖలాలు లేవు , అయినప్పటికీ ఆమెని అంతలా టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరు? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో పని చేస్తున్న రోజుల్లో కొంతమందితో ఆమెకు విబేధాలు ఏర్పడ్డాయని , అప్పటి నుండి ఆమెని టార్గెట్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం?, ఏది అబద్దం? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.