https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ తాజా సర్ ప్రైజ్ కి రీజన్ అదే !

ఆర్ఆర్ఆర్… ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నేషనల్ రేంజ్ లో భారీ అంచనాలు ఉన్న నిజమైన మల్టీస్టారర్ మూవీ. అందుకే ఈ సినిమా నుండి చిన్న పోస్టర్ రిలీజ్ చేయాలన్నా నాలుగు వారాల ముందే హడావుడి ఉంటుంది. అలాంటిది ఈ రోజు ఈ సినిమా నుండి వచ్చిన స్టిల్స్ చూస్తుంటే.. నెటిజన్ల ఆనందానికి అవధలు లేకుండా పోయాయి. అసలు ఉన్నట్లు ఉండి దీపావళి పండుగ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఫ్యాన్స్ కు ఈ రేంజ్ సర్ […]

Written By:
  • admin
  • , Updated On : November 13, 2020 / 04:39 PM IST
    Follow us on


    ఆర్ఆర్ఆర్… ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నేషనల్ రేంజ్ లో భారీ అంచనాలు ఉన్న నిజమైన మల్టీస్టారర్ మూవీ. అందుకే ఈ సినిమా నుండి చిన్న పోస్టర్ రిలీజ్ చేయాలన్నా నాలుగు వారాల ముందే హడావుడి ఉంటుంది. అలాంటిది ఈ రోజు ఈ సినిమా నుండి వచ్చిన స్టిల్స్ చూస్తుంటే.. నెటిజన్ల ఆనందానికి అవధలు లేకుండా పోయాయి. అసలు ఉన్నట్లు ఉండి దీపావళి పండుగ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఫ్యాన్స్ కు ఈ రేంజ్ సర్ ప్రైజ్ సడెన్ గా ఎందుకు ఇచ్చారో గాని, తారక్, చరణ్ లుక్స్ మాత్రం పీక్స్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

    Also Read: రానాపై ప్రశంసలు కురిపిస్తున్న మిహికా.. ఎందుకంటే?

    పైగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటు రాజమౌళి కూడా అదే గెటప్ లో కనిపించడం.. ముగ్గురు కలిసి కూర్చొని సరదాగా కాసేపు ముచ్చటించినట్లు అందరూ ఫోజులు ఇవ్వడం.. మొత్తానికి ఈ ఫోటోలు చూడటానికి ఫ్యాన్స్ కి రెండు కళ్ళు చాలడం లేదు. అయితే.. అసలు ఉన్నట్లు ఉండి ఇంత సడెన్ గా హీరోల పై ఫోటోషూట్ చేయడానికి కారణం దీపావళి ఒక్కటే కాదట. ఈ ఫోటోల వెనుక రాజమౌళి ప్లాన్ మరొకటి ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుండి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ టీజర్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే నార్త్ లో ఎన్టీఆర్ టీజర్ కి వచ్చిన స్పందనలో ఎన్టీఆర్ లుక్స్ పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయట.

    Also Read: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూసే !

    ఎన్టీఆర్ యాక్టింగ్ అండ్ బాడీ అద్భుతంగా ఉన్నా.. హీరో రేంజ్ గ్లామర్ అయితే ఆయనలో కనబడలేదు అని బాలీవుడ్ ప్రేక్షకులు పోస్ట్ లు పెట్టారట. అది గమనించిన రాజమౌళి.. హీరోల స్టైలిష్ లుక్ ఎలివేట్ అయ్యేలా మంచి ఫోటోషూట్ ఒకటి చేసి.. జనం మీదకు వదిలారు. అనుకున్నట్లుగానే బాలీవుడ్ లో కూడా ఈ ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఇద్దరూ తెల్లటి దుస్తులు ధరించి… దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నట్టు కనిపించడం.. పక్కనే కూర్చున్న రాజమౌళి… వాళ్లిద్దరికీ ఏదో చెబుతున్నట్టుగా ఫోటోలో ఉండటం.. మెయిన్ గా ఎన్టీఆర్ లుక్ చాలా బాగా కనిపిస్తుండటంతో బాలీవుడ్ లో కూడా ఈ రోజు ఈ ఫోటోలు స్పెషల్ గా నిలిచేలా ఉన్నాయి. ఏమైనా గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళి నిజంగా గ్రేటే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్