అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ పుస్తకాన్ని రాశాడు. దాని పేరు ఏ ప్రామిస్డ్ ల్యాండ్. ఈ బుక్ ఇప్పడు దేశవ్యాప్తంగా హాట్ కేకుల్లా అమ్ముడు పోతుంట. తన హాయంలో జరిగిన సంఘటనలు, పలు రాజకీయ అంశాలతో రచించిన ఈ పుస్తకంలో భారతీయుల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’లో ప్రస్తావించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.
Also Read: అమెరికా ఎన్నికలు: ట్రంప్ ఖాతాలోకి అలస్కా
కాగా పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ దీన్ని ప్రచురించి అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో విడుదల చేయడంతో దీనికి ఎక్కువగా గిరాకీ పెరుగుతోంది. ఇదివరకు ఆయన ఎన్నో పుస్తకాలను రచించాడు. వాటి కంటే ఈ బుక్ ఎక్కువగా అమ్మడు పోతుందట. అయితే ఇందులో ఒబామా యూపీఏ ప్రభుత్వం గురించి చెప్పాడు. యూపీఏ ప్రభుత్వంలోని ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి వివరించాడు.
అయితే రాహుల్ గాంధీపై ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఒక పాఠశాలలో అందరికంటే ముందుగా హోం వర్క్ ను పూర్తి చేసి టీచన్ ను ఇంప్రెస్ చేసే వ్యక్తి లాంటి వారు. హోంవర్క్ ను త్వరగా పూర్తి చేసినా సబ్జెక్టుపై పట్టు సాధించలేకపోతున్నారు. సబ్జెక్టుపై పట్టు సాధించి టీచర్ లా వ్యవహరిస్తేనే భవిష్యత్ అని తెలిపారు.
Also Read: వామ్మో కరోనా వ్యాక్సిన్ ధర అంతనా..?
అలాగే సోనియాగాంధీ ఛార్లీక్రైస్ట్, రెహ్మఎమానుయెల్తో పోల్చారు. ఓ మహిళ పురుషులతో సమానంగా ఉన్న అసాధారణమైన ప్రతిభ ఉందన్నారు. మన్మోహన్, పుతిన్, అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన ఒబామా గురించి కూడా చెప్పారు. అలాగే ఒబామా అమెరికా అధ్యక్షుడిగా రెండు సార్లు ఎన్నికైన సందర్భాలను కూడా వివరించారు.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు