చిన్న సినిమా నిర్మాణంలో స్టార్ డైరెక్టర్? ఆ కథేంటో తెలుసా?

ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘సరిలేరునికెవ్వరు’ రిలీజైంది. ఈ మూవీ అటూ మహేష్ కెరీర్లోనూ.. ఇటూ దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్లోనూ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీతో అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. Also Read: కొత్త నేపథ్యంలో సూర్య క్రేజీ సినిమా ! ప్రస్తుతం అనిల్ రావిపూడికి వరుసగా పెద్ద హీరోల సినిమాలకే కమిటయ్యాడు. ‘సరిలేరునికెవ్వరు’ తర్వాత ఎఫ్-2 సిక్వెల్ గా […]

Written By: NARESH, Updated On : November 13, 2020 4:54 pm
Follow us on

ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘సరిలేరునికెవ్వరు’ రిలీజైంది. ఈ మూవీ అటూ మహేష్ కెరీర్లోనూ.. ఇటూ దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్లోనూ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీతో అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు.

Also Read: కొత్త నేపథ్యంలో సూర్య క్రేజీ సినిమా !

ప్రస్తుతం అనిల్ రావిపూడికి వరుసగా పెద్ద హీరోల సినిమాలకే కమిటయ్యాడు. ‘సరిలేరునికెవ్వరు’ తర్వాత ఎఫ్-2 సిక్వెల్ గా ఎఫ్-3తీయనున్నట్లు గతంలోనే ప్రకటించాడు. ఎఫ్-3లో హీరో వెంకటేష్.. వరుణ్ తేజ్ నటించనుండగా హీరోయిన్లు ఇంకా ఖరారు కాలేదు. అయితే కరోనా కారణంగా ఈ మూవీ ఇంకా పట్టాలేదు.

విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ షూటింగులో బీజీగా ఉండగా.. వరుణ్ తేజ్ నిహారిక పెళ్లి వేడుకలతో బీజీగా ఉన్నాడు. దీంతో ఎఫ్-3 మూవీ ఆలస్యమయ్యేలా కన్పిస్తోంది. ఈలోపు అనిల్ రావిపూడి ఓ చిన్న సినిమా కోసం కథను సిద్ధ చేస్తున్నాడని సమాచారం. ఆ సినిమాకు కేవలం కథను అందించమే కాకుండా నిర్మాణంలో భాగస్వామ్యం కానున్నారనే టాక్ విన్పిస్తోంది.

Also Read: రానాపై ప్రశంసలు కురిపిస్తున్న మిహికా.. ఎందుకంటే?

అనిల్ రావిపూడి తన స్నేహితుడైన నిర్మాత సాహు గారపాటితో కలిసి తాజాగా ఓ చిన్న సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. శ్రీవిష్ణు హీరోగా నటించే ఈ మూవీకి  అనిల్ రావిపూడి కథను అందించడంతోపాటు సినీ నిర్మాణంలో సహకారం అందించనున్నాడని టాక్. ఈ సినిమాకు అయ్యే ఖర్చులను అనిల్ రావిపూడి మరోమిత్రుడైన సాయి పర్యవేక్షిస్తారని తెలుస్తోంది.

‘అశ్వద్ధామ’ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని ప్రచారం జరుగుతోంది. కాగా అనిల్ రావిపూడి హీరోల కోసం టైమ్ వేస్ట్ చేయకుండా ఓ చిన్న సినిమాను నిర్మిస్తుండటం విశేషం. దర్శకత్వంలో రాణించిన అనిల్ రావిపూడి సినీ నిర్మాణంలోనూ లాభాలు ఆర్జిస్తాడో లేదో వేచిచూడాల్సిందే..!

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్