Tamannaah Bhatia: సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో తమన్నా(Tamannaah Bhatia) ముందు వరుసలో ఉంటుంది. తమన్నా లాంటి అమ్మాయి మన జీవితంలో భార్య గా రావాలని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. అలాంటి అమ్మాయి విజయ్ వర్మ(Vijay Varma) లాంటి అబ్బాయికి పడిపోయిందని తెలిసి కోట్లాది మంది యువత కుల్లుకున్నారు. తమన్నా చూస్తే పాల రాతి బొమ్మ లాగా ఉంటుంది, అతను చూస్తే చాలా యావరేజ్ లుక్స్ తో ఉన్నాడు, ఇతనికి ఎలా పడిపోయింది అంటూ ప్రతీ ఒక్కరు కుల్లుకున్నారు. తమన్నా ఎక్కడికి వెళ్లినా అతనితో కలిసి వెళ్తుండడం, దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం వంటివి చూసి తట్టుకోలేకపోయేవారు ఫ్యాన్స్. అయితే గత కొద్దిరోజుల నుండి వీళ్లిద్దరు విడిపోయారు అంటూ వస్తున్న వార్తలను మనం గమనిస్తూనే ఉన్నాం. తమన్నా విజయ్ తో కలిసి ఉన్నటువంటి ఇంస్టాగ్రామ్ ఫోటోలను కూడా తొలగించేసింది.
దీంతో వీళ్లిద్దరి బ్రేకప్ ఖరారు అయ్యినట్టే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అసలు వీళ్ళ బ్రేకప్ ఎందుకు జరిగిందో పూర్తి వివరాలు ఇందులో చూద్దాము. అందరి లాగానే వీళ్ళు కూడా కొన్నేళ్లు డేటింగ్ చేద్దాం, ఆ తర్వాత ఒకరికి ఒకరు బాగా నచ్చితే పెళ్లి చేసుకుందాం అనే కాన్సెప్ట్ తోనే రిలేషన్ ని ప్రారంభించారు. వీళ్లిద్దరి పెళ్లి గత ఏడాదే అవ్వాలి. కానీ తమన్నా చేతిలో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి. అవన్నీ పూర్తి అయ్యాక చేసుకోవాలి అనే ప్లాన్ లో ఉన్నింది. ఇప్పుడిప్పుడే ఆమె తనకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ అన్నిటిని పూర్తి చేసుకొని కెరీర్ పరంగా ఫ్రీ అయ్యింది. రీసెంట్ గానే ఆమె విజయ్ వర్మ తో ఇక మనం పెళ్లి చేసుకుందామా అని అడిగిందట. దానికి విజయ్ నుండి రెస్పాన్స్ పాజిటివ్ గా రాలేదని తెలుస్తుంది. కారణం తమన్నా ప్రవర్తన డామినేటింగ్ గా ఉండడం వల్లనేనట.
స్నేహం లో డామినేషన్ చూపిస్తే పర్వాలేదు అనుకోవచ్చు, కానీ జీవితాంతం భార్య దగ్గర డామినేషన్ తో బ్రతకాలి, ఆమె క్రిందనే ఉండాలి అనేలా ఉంటే ఏ అబ్బాయికి కూడా నచ్చదు. విజయ్ వర్మ కి కూడా అలాంటి ఫీలింగ్ కలిగిందట. అందుకే తమన్నా పెళ్లి ప్రపోజల్ ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. పెళ్లి వద్దు, రొమాంటిక్ రిలేషన్ వద్దు, కానీ మంచి స్నేహితులం లాగా ఇలాగే కొనసాగుదాం అని అన్నాడట. అందుకు తమన్నా చాలా బాదపడిందట, చాలా వరకు విజయ్ ని ఒప్పించడానికి ప్రయత్నం చేసింది కానీ, అతను మాత్రం తగ్గలేదట. దీంతో బాగా హర్ట్ అయిన తమన్నా అతని నెంబర్ ని తన మొబైల్ నుండి తొలగించి, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో అతన్ని బ్లాక్ చేసి, గతంలో అతనితో కలిసి ఉన్నటువంటి ఫోటోలను మొత్తం తొలగించిందట. ఇది తమన్నా, విజయ్ వర్మ లవ్ బ్రేకప్ స్టోరీ.