Ram Charan: గడిచిన దశాబ్ద కాలం నుండి స్టార్ హీరోలలో తమ అద్భుతమైన నటన తో ప్రేక్షకులకు మర్చిపోలేని థియేట్రికల్ అనుభూతిని కలిగించిన హీరో ఎవరు అంటే ఎవరైనా రామ్ చరణ్(Global Star Ram Charan) పేరు చెప్పాల్సిందే. ‘రంగస్థలం’ చిత్రంతో ఆయన ఆ స్థాయి ఇమేజ్ ని దక్కించుకున్నాడు. అంతకు ముందు నటనలో రామ్ చరణ్ కి కొన్ని రిమార్క్స్ ఉండేవి. మొదటి మూడు సినిమాల్లో అద్భుతంగా నటించాడు కానీ, ఆ తర్వాత రామ్ చరణ్ నటన బాగా రొటీన్ అయిపోయింది అంటూ రివ్యూయర్స్ సైతం విమర్శలు చేసేవారు. కానీ ఎప్పుడైతే ‘రంగస్థలం’ చిత్రం విడుదలైందో అప్పటి నుండి ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం మొత్తం మారిపోయింది. ఇండియాలోనే విలక్షణ నటులలో ఒకడిగా మారిపోయాడు రామ్ చరణ్. ఇందులో రామ్ చరణ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన పేద కుర్రాడిగా కనిపిస్తాడు. ఎదో చిన్నప్పటి నుండి ఆయన పేదరికంలోనే పుట్టి పెరిగినట్టు, ఎంతో సహజంగా నటించాడు రామ్ చరణ్.
చిరంజీవి(Megastar Chiranjeevi) అంటే సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చాడు కాబట్టి, ఆ మధ్య తరగతి కుటుంబాలలో ఉండే సాధక బాధకాలు మొత్తం ఆయనకు తెలుసు కాబట్టి, ఇలాంటి పాత్రలు చేసే అలవాటు వచ్చినప్పుడు అలవోకగా చేసేయగలడు. కానీ రామ్ చరణ్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్. ఆయనకు చిన్నప్పటి నుండి మట్టిలో తిరగడం వంటివి తెలియదు. అలాంటి రామ్ చరణ్ ఈ సినిమాలో అంత సహజంగా ఎలా నటించగలిగాడు అనేది ఇప్పటికీ సర్ప్రైజ్ అనే అనాలి. ఈ చిత్రం లో ఆయనతో డైరెక్టర్ సుకుమార్ అంట్లు తోమడం, బట్టలు ఉతికించడం వంటివి చేయించాడు. ఇవి చూసే ఆడియన్స్ కి తమని తాము చూసుకున్నట్టుగా అనిపించింది. అందుకే వాటికి అంతలా కనెక్ట్ అయ్యారు. గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అనేక మంది సుకుమార్(Director Sukumar) ని ఇదే ప్రశ్న అడిగారు.
రామ్ చరణ్ తో అంట్లు తోమడం వంటి కార్యక్రమాలు ఎలా చేయించారు సార్, అవి చూసేందుకు చాలా సహజం గా అనిపించాయి అని అడిగితే, ఆయన దానికి బదులిస్తూ ‘ఆ క్రెడిట్ రామ్ చరణ్ కి దక్కుతుంది. ఇంట్లో చాలా ఏళ్ళ నుండి ఆయనకు అలాంటి పనులు చేస్తూ ఉండడం బాగా అలవాటు అట. అందుకే ఆ సన్నివేశాలు అంత సహజంగా పండాయి’ అని చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అయ్యుండొచ్చు, కానీ చిరంజీవి చిన్నప్పటి నుండి మధ్య తరగతి కుటుంబ వాతావరణంలోనే తన పిల్లల్ని పెంచాడు అనడానికి ఈ సంఘటన ఒక చిన్న ఉదాహరణ. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు తో గ్రామీణ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా రూరల్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతుంది. జెట్ స్పీడ్ లో షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ దూసుకెళ్తున్న ఈ సినిమా, ఈ ఏడాది లోనే విడుదల కాబోతుంది.