Pawan Kalyan: ‘శ్రీరాముడు’ ఏకపత్నీ వత్రుడు.. శ్రీకృష్ణుడు మాత్రం స్త్రీలోలుడు.. అతడికి 16వేల గోపికలు..పలువురు భార్యలు.. మరి దేవుళ్లకే లేనిది సామాన్యులకు బహుభార్యలు ఉంటే తప్పా? ‘అరె చల్ రా బై.. నా లైఫ్.. నా వైఫ్స్’ అంటారా?.. మరి మన రాజులు బహుభార్యలను చేసుకున్నారు కదా? ఇప్పటికీ షేక్ లు, ముస్లిం దేశాల్లో సంపన్నులు బహుభార్యలు కలిగి ఉన్నారు. మన దేశంలోనూ ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుళ్లు చాలా మంది ఉన్నారు. అయితే బహుభార్యత్వాన్ని ఎవ్వరూ పోత్సహించరు.. అఫ్ కోర్స్ మేం కూడా.. కానీ మన టైం బాగోలేక ఒక్కోసారి మన జీవితంలో ఒకరికంటే ఎక్కువ ఆడవాళ్లు తారసపడుతారు.. దాంతో మన ఖర్మ కాలి.. తప్పనిసరి పరిస్థితుల్లో మన ప్రమేయం లేకుండానే పడతులతో కమిట్ కావాల్సి వస్తుంది.. వారి మనసులను దోచేసుకుంటాం.. అలా ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకునే పరిస్థితి వస్తుంది.. ‘‘ఫాఫం.. ఫవన్ కళ్యాణ్’’ కూడా అలానే బుక్కయ్యారు. ఆయన ఎంతో ఉన్నతమైన సైద్ధాంతిక, ఆదర్శ జీవితం గడిపినా.. ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆటుపోట్లతో మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడదే ఆయన రాజకీయ జీవితానికి గుదిబండగా మారింది.. విమర్శలకు తావిస్తోంది. అసలు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు.. అసలు కారణాలేంటి? ఎందుకు ఇలా జరిగిందనే దానిపై స్పెషల్ ఫోకస్..

సినిమాల్లో, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో, జనసేనాని పవన్ కల్యాణ్ ఈమధ్య వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాల్లో మాస్ అండ్ క్లాస్ హీరోగా పేరు తెచ్చుకొని అశేష అభిమానాన్ని సంపాదించుకున్నాడు పవన్. మూడేళ్లపాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా ఆయన.. రాజకీయాల్లో విఫలం అయ్యాక తిరిగి సినిమాల్లోకి వచ్చారు. అభిమానగణం తగ్గలేదని నిరూపిస్తూ ‘వకీల్ సాబ్’తో సత్తా చాటాడు. అనంతరం వరుస సినిమాలు పట్టాలెక్కించాడు. పవన్ సినిమాలు తీయకపోయినా ఆయనపై అభిమానం ‘తగ్గేదేలే’ అన్నట్లుగా ఉందని అందరికీ తెలిసిందే. ఇక పొలిటికల్ గా పవన్ ఫెయిల్ అయినా ఆయన వెంట జనం ఉన్నారనేది తెలుస్తూనే ఉంది. రాజకీయంగా పవన్ ను విమర్శించాలంటే ముందుగా ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారన్న ఆరోపణలను ప్రత్యర్థులు చేస్తున్నారు. అయితే పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం ఏంటి..? ఎలాంటి పరిస్థితుల్లో ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తుండగానే ‘నందని’ అనే అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఇది అరేంజ్డ్ మ్యారేజ్. పెద్దల సమక్షంలో వీరి పెళ్లి 1997లో జరిగింది. వీరి వివాహానికి సినీ పెద్దలతంతా హాజరై ఆశీర్వదించారు. అయితే ఆ తరువాత వీరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత పవన్ సినిమాలు కొనసాగించారు. అయితే పూరి జగన్నాథ్ ‘బద్రి’ సినిమాలో పరిచయమైన రేణు దేశాయ్ తో చాలా రోజులు సహజీవనం చేసి అనంతరం పెళ్లి చేసుకున్నారు. పవన్ తో ‘జానీ’ సినిమాలోనూ భార్యపాత్రలో రేణు నటించింది. ఈ సినిమాను పవన్ స్వయంగా తీశాడు. పెళ్లికి ముందే వీరు బిడ్డకు జన్మనివ్వడం విశేషం. వీరికి ఓ బాబు పుట్టాక పెళ్లి చేసుకున్నారు.
అయితే పవన్ లో కొంచెం దయాగుణం ఎక్కువే. తనకు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును ఎక్కువగా సాయానికే వెచ్చించేవాడు. తన ఇంటికి వెళ్లి ఎవరైనా కష్టం చెప్పుకుంటే ఏమాత్రం వెనుకాడకుండా వారికి సాయం అందించేవాడు. తన సోదరుడు నాగబాబు కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ తన ఇల్లు తాకట్టు పెట్టి మరీ డబ్బులు అందించాడు. అయితే రేణు దేశాయ్ తోనూ పవన్ విడిపోవాల్సి వచ్చింది.. కారణాలు బహిరంగ రహస్యమైనా అన్ని సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు పిల్లలను కన్న తర్వాత పవన్ తన రెండో భార్య రేణుదేశాయ్ కు దూరంగా ఉంటూ వచ్చింది. ఆ తరువాత విడాకులు తీసుకున్నారు. ఇది సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇక పవన్ కళ్యాణ్ ‘తీన్మార్’ సినిమాలో తనతో కలిసి నటించిన అన్నాలెజ్నోవాను మూడో పెళ్లి చేసుకున్నాడు. తీన్మార్ సినిమాలో నటించే సమయంలో పవన్ వ్యక్తిత్వం నచ్చి దగ్గర కావడంతో రేణుకు విడాకులు ఇచ్చి మూడో భార్యగా అన్నా లెజ్నోవాను పవన్ చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు.. హాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఈమె ప్రస్తుతం పవన్ తోనే ఉంటోంది. తెలుగు సంప్రదాయాన్ని అలవరుచుకొని బతుకుతోంది. ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఆమె చిరంజీవి కుటుంబంతోనూ కలిసిమెలిసి ఉండడం చూసి అందరూ ముచ్చటపడిపోతున్నారు.
జీవితంలో అనుకోని సంఘటనల వల్ల పవన్ కళ్యాణ్ ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.విధి రాసిన వింత నాటకంలో పవన్ పావుగా మారి అలా చేయాల్సి వచ్చింది. అయితే ఆయన ప్రత్యర్థులకు మాత్రం ఇదే ఆయుధమైంది. పవన్ వేరే రకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. అనుకోని పరిస్థితుల వల్ల మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని కొందరు అభిమానుల సోషల్ మీడియాలో చెబుతున్నా ప్రత్యర్థులు మాత్రం లేనివి పోనివి కల్పించి ఆరోపిస్తున్నారు.
పవన్ పొలిటికల్ కెరీర్ ను దెబ్బ తీయాలనే ఉద్దేశంతోనే పవన్ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలియక చాలామంది ప్రత్యర్థులు ఆయన పర్సనల్ లైఫ్ పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. పవన్ మూడు పెళ్లిళ్లకు కారణం తెలిస్తే అదో యాక్సిడెంటల్ సంఘటనలు.. మనస్పర్థలతో తలెత్తిన విడాకులు అని చెప్పొచ్చు. ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరికి నచ్చాలని లేదు. పవన్ వ్యక్తిత్వమే విభిన్నం.. సమాజహితం.. అది నచ్చక ఇద్దరు విడిపోయారు. అయితే దాన్ని భూతద్దంలో చూపించి ప్రత్యర్థులు ఆడిపోసుకుంటున్నారు. ఇటీవల కొందరు రాజకీయ నాయకులు పవన్ మూడు పెళ్లిళ్లపై అనేక ఆరోపణలు చేస్తుండడంతో పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితుల ప్రభావంతో పవన్ ఈ పెళ్లిళ్లు చేసుకున్నాడని చెబుతున్నారు.