PPF account: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లు ఆకర్షణీయమైన రాబడితో పాటు అదిరిపోయే ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్లు లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్లు లోన్ తీసుకోవాలని అనుకుంటే కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలను అనుసరిస్తే మాత్రమే రుణాన్ని తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే పీపీఎఫ్ ఖాతాను కలిగి ఉంటారో వాళ్లు పీపీఎఫ్ అకౌంట్ ను ఓపెన్ చేసిన 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల కాలంలో లోన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. షార్ట్ టర్మ్ లోన్స్ గా ఈ రుణాలు ఉంటాయి.
ఎవరైతే ఈ లోన్ ను తీసుకుంటారో వాళ్లు తీసుకున్న రుణాన్ని మూడు సంవత్సరాలలో తిరిగి చెల్లించాలి. పీపీఎఫ్ ద్వారా రుణాన్ని తీసుకున్న వాళ్లు 1 శాతం వడ్డీరేటును తీసుకున్న రుణానికి చెల్లించాలి. తీసుకున్న రుణాన్ని 36 నెలల లోపు తిరిగి చెల్లిస్తే మాత్రమే ఈ వడ్డీరేటు వర్తింపు జరుగుతుంది. అలా జరగని పక్షంలో 6 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంలో 25 శాతం రుణంగా పొందవచ్చు.
లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని భావించే వాళ్లు ఫామ్ డి ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడైతే పీపీఎఫ్ ఖాతాను ఓపెన్ చేశారో అక్కడ లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సమీపంలోని పోస్టాఫీస్ లేదా బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.