Ravi Teja: సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు ఏ హీరో స్టార్ పొజిషన్ లో ఉంటాడో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్క సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని స్టార్ స్టేటస్ ని అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క ప్లాప్ తో వాళ్ల స్టార్ డమ్ మొత్తాన్ని కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ వరుస సక్సెస్ లతో ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.
అయితే ఈయన చేస్తున్న సినిమాలు ఒకానొక సమయంలో రొటీన్ సినిమాలు కావడం వల్ల ఆయనకి పెద్దగా గుర్తింపు అయితే రాకుండా పోయింది. అయిన కూడా తను ఎప్పుడు డిఫరెంట్ అటెంప్ట్ లని ట్రై చేయకుండా ఒకే మూస ధోరణి లో ఉండే రొటీన్ ఫార్మాట్ లో కమర్షియల్ సినిమాలను చేయడమే ఎజెండాగా పెట్టుకొని ముందుకు కదులుతున్నాడు. మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమా సక్సెస్ అయిన కూడా తనకున్న మార్కెట్ ఒకేలా ఉంటుంది లేదా డౌన్ అయిపోతుంది. అంతే తప్ప అది పెరగడం లేదు. అందువల్లే ఆయన స్టార్ హీరోగా ఎదిగిన ఆయన మార్కెట్ 100 కోట్ల లోపే ఉండడం విశేషం…
ఇక మొత్తానికైతే ప్రస్తుతం రవితేజ మార్కెట్ అనేది భారీగా పడిపోయింది. దానివల్లే ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు పెద్దగా ఆసక్తిని చూపించనట్టుగా తెలుస్తోంది. క్రాక్ సినిమా సక్సెస్ తర్వాత గోపీచంద్ మలినేని రవితేజ కాంబినేషన్ లో మరో సినిమా రావాల్సింది. ఆ సినిమాను అనౌన్స్ కూడా చేశారు. అయినప్పటికీ ఆ సినిమాకి అయ్యే బడ్జెట్ కి రవితేజ కు ఉన్న మార్కెట్ కి మధ్య భారీ తేడా ఉండడంతో ఆ సినిమా ప్రొడ్యూసర్స్ ప్రస్తుతానికి దాన్ని హోల్డ్ లో పెట్టారు. ఇక ఈ సినిమా మీద అంత బడ్జెట్ పెడితే అది సూపర్ డూపర్ సక్సెస్ అయిన రవితేజ కున్న మార్కెట్ కి అన్ని కలెక్షన్స్ రావడం అనేది కష్టంగా ఉందట.
అందుకే స్టార్ డైరెక్టర్లు తనతో సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు. ఇక దానికి తగ్గట్టుగానే రవితేజ కూడా రెమ్యూనరేషన్ విషయంలో అసలు తగ్గడం లేదు. ఒకవేళ ఆయన రెమ్యూనరేషన్ కొంచెం తగ్గించుకున్నట్లయితే ఆ డబ్బుని సినిమా మీద పెట్టవచ్చని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు. అయిన కూడా రవితేజ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. అందువల్లే ఆయన దగ్గరికి స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా రావడంలేదనే వార్తలు వస్తున్నాయి…