Ravi Teja: ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లలో రవితేజ పరిచయం చేసిన దర్శకులే ఎక్కువగా ఉన్నారా..?

భద్ర సినిమాతో రవితేజ బోయపాటి శ్రీను ను డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న బోయపాటి, ఆ తర్వాత వరుస సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంటూ స్టార్ హీరోలని సైతం డైరెక్ట్ చేస్తున్నాడు.

Written By: Gopi, Updated On : February 25, 2024 10:49 am
Follow us on

Ravi Teja: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాడు అంటే ఆయన ఎంచుకున్న స్టోరీలు గాని, ఆయన సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్లు గానీ అందులో ముఖ్య పాత్రను పోషిస్తారు. ఎందుకంటే ఒక స్టోరీ బాగుండి, ఆ సినిమాని బాగా తీయగలిగే దర్శకుడు దొరికినప్పుడే ఒక హీరో క్యారెక్టర్ అనేది ఎలివేట్ అవుతుంది.

అలాగే ఆ హీరోకి మంచి పేరు కూడా వస్తుంది. ఇలాంటి విషయంలో చిరంజీవి చాలా ముందు వరుసలో ఉంటాడనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎంచుకునే స్టోరీలు గానీ, ఆయన ఒక సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్న దర్శకులు గానీ మంచి టాలెంటెడ్ దర్శకులు అయి ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఒక విషయం లో చిరంజీవికి సైతం సాధ్యం కానీ రీతిలో రవితేజ ముందు వరుస లో ఉన్నాడు. అదేంటంటే సినిమా ఇండస్ట్రీకి రవితేజ ఇప్పటి వరకు చాలామంది కొత్త దర్శకులను పరిచయం చేశాడు. వాళ్లలో చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు గా కొనసాగుతున్నారు. వాళ్ళు ఎవరో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

బోయపాటి శ్రీను
భద్ర సినిమాతో రవితేజ బోయపాటి శ్రీను ను డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న బోయపాటి, ఆ తర్వాత వరుస సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంటూ స్టార్ హీరోలని సైతం డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా బోయపాటి ముందుకు దూసుకెళ్తున్నాడు…

హరీష్ శంకర్
షాక్ సినిమాతో రవితేజ హరీష్ శంకర్ ని దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. అయినప్పటికీ రవితేజ ఎక్కడ కూడా నిరాశపడకుండా తన తదుపరి సినిమా అయిన మిరపకాయ్ సినిమాకి కూడా హరీష్ శంకర్ కి మరొకసారి అవకాశం ఇచ్చి ప్రోత్సహించడం తో ఆ సినిమాతో సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను తీసి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక సపరేట్ గుర్తింపును సంపాదించుకున్నాడు…ఇక ప్రస్తుతం రవితేజతో మరోసారి మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు…

ఇక వీళ్ల తర్వాత గోపీచంద్ మలినేని, బాబీ లాంటి స్టార్ డైరెక్టర్ల ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. వీళ్లు స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి దర్శకులుగా గుర్తింపు పొందుతున్నారు. మొత్తానికైతే రవితేజ డైరెక్టర్లను పరిచయం చేయడంలో ఇండస్ట్రీ లో ఉన్న సీనియర్ స్టార్ హీరోల కంటే కూడా తను ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి…