Ravi Teja returned Remuneration: ఎలాంటి సపోర్టు లేకుండా సోలోగా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ లను సాధించిన వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటే, రవితేజ రెండో స్థానంలో నిలుస్తాడు. ఇక రవితేజ కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ వచ్చాడు. ఇక ఎప్పుడైతే సింధూరం, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్ లాంటి సినిమాలు చేశాడో అప్పటినుంచి తను స్టార్ హీరోగా మారిపోయాడు… రవితేజ ప్రస్తుతం కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. సినిమా కథ ఎలా ఉన్నా పర్లేదు రవితేజకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇస్తే చాలు ప్రతి సినిమా చేస్తాడు అంటూ గత కొద్దిరోజులుగా అతని మీద కొన్ని కామెంట్స్ వస్తున్నాయి.
కానీ డబ్బులతో సంబంధం లేకుండా రవితేజ ఒక సినిమాని చేశాడు ఆ సినిమా ఫ్లాప్ అయిందని తెలిసిన వెంటనే ఆ నిర్మాతకు డబ్బులు కూడా తిరిగి ఇచ్చేసినట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి… ఇంతకీ ఆ సినిమా ఏంటంటే రవితేజ హీరోగా వచ్చిన ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’ సినిమా తెలుగులో ప్లాప్ అయింది.
Also Read: ఇండస్ట్రీ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉందా..? ఆ రెండు కులాల వారికే ఎక్కువ ఛాన్సులు వస్తున్నాయా..?
ఈ సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్ లో సగభాగాన్ని రవితేజ తన ప్రొడ్యూసర్ కి తిరిగి ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది. ఫీల్ గుడ్ సినిమాగా వచ్చి అప్పట్లో ప్రేక్షకుల మనసులను దోచుకున్నప్పటికి ఏదో ఒక చిన్న వెలతి కారణంగా ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు. అందువల్లే రవితేజ తన రెమ్యూనరేషన్ లో సగభాగాన్ని ఇచ్చేశాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇక ఇప్పుడు కూడా ఆ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది… ప్రస్తుతం రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ ఇరుముడి’ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా చేయడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక రవితేజ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు… గత కొద్ది రోజుల నుంచి ఆయనకు అనుకున్న సక్సెస్ రావడం లేదు. ఇక ఎట్టకేలకు ఇప్పుడు భారీ విజయాలను సాధించి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…