Ravi Teja : ‘రావణాసుర’ బయ్యర్స్ నష్టాలను పూడ్చేసిన రవితేజ..ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదుగా!

ప్పటికే రెండు ప్రాంతాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు సెటిల్ చేసేసాడట. రవితేజ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని ఆయన అభిమానులతో పాటుగా నెటిజెన్స్ కూడా ఆహ్వానిస్తూ అభినందిస్తున్నారు.

Written By: NARESH, Updated On : May 24, 2023 10:09 pm
Follow us on

Ravi Teja : ‘ధమాకా’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ లాంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘రావణాసుర’ చిత్రం రీసెంట్ గానే విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమా బాగున్నప్పటికీ కూడా రవితేజ ని పూర్తి స్థాయి నెగటివ్ రోల్ లో చూసేందుకు ఫ్యాన్స్ – ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఈ చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది.

కానీ ఓటీటీ లో విడుదలైన తర్వాత మాత్రం ఈ సినిమాకి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఒక సూపర్ హిట్ సినిమాకి ఎన్ని వ్యూస్ అయితే వస్తాయో అంతకంటే ఎక్కువ వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. దాంతో రవితేజ ఈ సినిమా కారణంగా నష్టపోయిన ప్రతీ డిస్ట్రిబ్యూటర్ కి నష్టపరిహారం చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నాడట. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 22 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట.

కానీ ఫుల్ రన్ లో ఈ చిత్రం కేవలం 12 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది. కేవలం 50 శాతం మాత్రమే రికవరీ చేసింది కాబట్టి ఈ చిత్రం డిజాస్టర్ క్యాటగిరీ లోకి వస్తుంది. అందుకే ఈ సినిమాకి నష్టపోయిన ప్రతీ ఒకరికి తన వంతు సహకారంగా కొంత డబ్బులు బయ్యర్స్ కి సెటిల్ చేసేందుకు ముందుకు వచ్చాడట రవితేజ. ఈ చిత్రం లో ఆయన కేవలం హీరో మాత్రమే కాదు, నిర్మాత కూడా.

అందుకే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రెండు ప్రాంతాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు సెటిల్ చేసేసాడట. రవితేజ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని ఆయన అభిమానులతో పాటుగా నెటిజెన్స్ కూడా ఆహ్వానిస్తూ అభినందిస్తున్నారు. రవితేజ ఇలా చెయ్యడం ఇదేమి కొత్త కాదు, గతంలో కూడా ఆయన ఇలా ఎన్నో సార్లు చేసిన సందర్భాలు ఉన్నాయి.