https://oktelugu.com/

Chiranjeevi vs Ram : మెగాస్టార్ చిరంజీవి ని టార్గెట్ చేసిన హీరో రామ్..ఇంత పగ ఎందుకు!

తన తోటి హీరోల మంచి కోరుకునే రామ్ కి ఇలాంటి ఆలోచన ఉండకపోవచ్చు,కానీ బోయపాటి శ్రీను కి మాత్రం ఆ ఆలోచనలు ఉండే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే 'వినయ విధేయ రామ' సినిమా సమయం లో మెగా కుటుంబం తో ఆయనకి విభేదాలు ఏర్పడ్డాయి

Written By:
  • NARESH
  • , Updated On : May 24, 2023 / 10:04 PM IST
    Follow us on

    Chiranjeevi vs Ram : హీరో రామ్ మెగాస్టార్ చిరంజీవి పై తెగ పగ బట్టేసాడు.. అందరి మంచి కోరుకునే మెగాస్టార్ చిరంజీవి మీద అంత పగ ఎందుకు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం బోయపాటి శ్రీను తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రీసెంట్ గానే రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు.

    రెస్పాన్స్ అదిరిపోయింది, అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ 20 వ తారీఖున విడుదల చేస్తున్నట్టుగా టీజర్ కి ముందే అధికారిక ప్రకటన చేసారు. అయితే ఇప్పుడు షూటింగ్ కార్యక్రమాలన్నీ చకచకా అయిపోతుండడం తో ఈ చిత్రాన్ని అక్టోబర్ నుండి ఆగష్టు నెలకు ప్రీ పోనే చేసే ఆలోచనలో ఆ చిత్ర నిర్మాత ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తమ సినిమాని ముందుగా రిలీజ్ చేసుకోవడం తప్పేమి ఉంది, ఇందులో చిరంజీవి మీద పగ ఎక్కడుంది అని మీరందరూ అనుకోవచ్చు.

    కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది, ఈ చిత్రాన్ని ఆగష్టు 11 వ తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట. అదే రోజు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’ సినిమా కూడా ఉంది. ఇలా చిరంజీవి సెట్ చేసుకున్న డేట్ లోనే ఈ సినిమా విడుదల అవ్వడం పై అర్థం ఏమిటి..?, చిరంజీవి ని కావాలని టార్గెట్ చెయ్యడేమేగా అని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.

    తన తోటి హీరోల మంచి కోరుకునే రామ్ కి ఇలాంటి ఆలోచన ఉండకపోవచ్చు,కానీ బోయపాటి శ్రీను కి మాత్రం ఆ ఆలోచనలు ఉండే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ‘వినయ విధేయ రామ’ సినిమా సమయం లో మెగా కుటుంబం తో ఆయనకి విభేదాలు ఏర్పడ్డాయి. బహుశా ఆ పగతోనే మెగాస్టార్ వస్తున్న రోజే రావాలని పట్టుబడుతున్నాడేమో అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనుంది.